Agent Producer’s Master Plan: సినిమాలు విడుదల చేయడానికి సంక్రాంతి కంటే బెస్ట్ సీజన్ ఏదీ లేదని అటు సినీ ట్రేడ్ వర్గాల వారు భావిస్తూ ఉంటారు, అందుకే పెద్ద సినిమాలు ఎక్కువగా సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ సంక్రాంతి సీజన్ కి గురి కుదరకపోతే తర్వాత వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా వచ్చే ఏడాది సంక్రాంతి విషయంలో ఆసక్తికరమైన సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి, చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు రంగంలోకి దిగాయి. వీరితోపాటు ప్రభాస్ ఆది పురుష్  సినిమా కూడా అదే సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అవుతున్నట్లుగా ప్రకటించారు. ఈ మూడు సినిమాలే అనుకుంటే విజయ్ వారసుడు సినిమాని కూడా అదే సంక్రాంతి సీజన్ కి విడుదల చేస్తున్నట్లుగా దిల్ రాజు ప్రకటించారు. ఇవన్నీ దాదాపుగా ఊహించినవే కాగా ఊహించని విధంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రూపొందుతున్న అఖిల్ ఏజెంట్ సినిమా కూడా సంక్రాంతి సీజన్ కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు.


ఈ విషయం మీదే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి ఆది పురుష్ సినిమాని కాస్త వాయిదా వేసుకోమని ఆ నిర్మాతలను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఆది పురుష్ సినిమా కనుక వాయిదా పడితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి కంటే  తమ సినిమాకి స్కోప్ ఉంటుందని ఏజెంట్ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


అందుకే ముందు జాగ్రత్తగా సంక్రాంతి రేసులో దిగుతున్నట్లు ప్రకటించారని, ఒకవేళ ఆది పురుష సినిమా సంక్రాంతికి రిలీజ్ కాకపోతే తమ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఒకవేళ ఆది పురుష్ గనుక ఆ సంక్రాంతికి వస్తున్నట్లు తెలిస్తే అప్పుడు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ముందుగా కర్చీఫ్  వేసి పెట్టుకుంటే అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ మాస్టర్ ప్లాన్ వేశారని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.


Also Read: Poonam Bajwa Pics: దీపావళి ఎఫెక్ట్.. రూట్ మార్చిన బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా!


Also Read: Anushka Sharma Pics: దీపావళి స్పెషల్.. శారీలో అందాల రాణిలా అనుష్క శర్మ! విరాట్ కోహ్లీ చాలా లక్కీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook