Rajamouli Viral Video: దేశవ్యాప్తంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి గుర్తింపు తీసుకువచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి. ఇంటర్నేషనల్ అవార్డుల పంటలు పండించి.. మన హీరోలకి వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చాడు ఈ డైరెక్టర్. ఒక సినిమాను చెక్కడం లో జక్కన్న కన్నా ఎక్స్పర్ట్ ఇంకెవరు ఉండరు అని ఇండస్ట్రీలో అందరూ భావిస్తారు. పర్ఫెక్షన్ కోసం ఏమైనా చేసే రాజమౌళి.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తారు. అందుకే ఆయన సినిమాలు ఆస్కార్ లెవెల్ కి సైతం వెళ్ళాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ బాబు తో కలిసి మరో భారీ ప్రాజెక్టుని రాజమౌళి చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి పై నెటిజన్లు సెటైర్లతో రెచ్చిపోతున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. అది తెలిస్తే వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని ఉండేది కాదు కదా అని విమర్శిస్తున్నారు. మరి ఇంతకీ జక్కన్న మిస్ అయిన ఆ లాజిక్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి..


టాలీవుడ్ విజువల్ వండర్ బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సంచలనమైన విజయం నమోదు చేసిందో అందరికీ తెలుసు. తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఈ చిత్రం. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీకి అయిన బడ్జెట్ సుమారు 400 కోట్లు. మొదటి భాగానికి 150 కోట్లు, రెండవ భాగానికి 250 కోట్ల వరకు బడ్జెట్ అయి ఉంటుందని అంచన. ఈ మూవీ మొదటి భాగం సుమారు 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా రెండవ భాగం ఏకంగా 1800 కోట్ల వసూలు తన ఖాతాలో వేసుకుంది. కనీవినీ ఎరుగని బాక్స్ ఆఫీస్ లెక్కలను ఈ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది.


కాగా బాహుబలి చిత్రంలో భళ్లాలదేవుడి పాత్రలో నటించిన రానా.. ఒక సీన్ లో భారీగా కనిపించే ఓ ఎద్దుతో ఫైట్ చేస్తాడు. ఈ సీన్ చేయడం కోసం గ్రాఫిక్స్ కి 100 కోట్లు ఖర్చు చేశారట. ప్రస్తుతం ఈ విషయంపై నెటిజెన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మద్యం తాగిన ఒక వ్యక్తి రోడ్డుపై ఎద్దుతో ఫైట్ చేసి గెలిచిన వీడియో గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. 90 తో అయిపోయే దానికి రాజమౌళి 250 కోట్లు ఖర్చు పెట్టాడు అని మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ తెలియక రాజమౌళి కోట్లు ఖర్చు పెట్టేసాడే అని కామెంట్లు పెడుతున్నారు.


 



ఇక ఇలా పోస్ట్ చేసిన వారికి ఘాతైన రిప్లై ఇస్తూ.. కొంతమంది సినీ అభిమానులు మాత్రం ఇలా చీప్ గా రాజమౌళి ఆలోచించు ఉంటే మన తెలుగు సినిమా స్థాయి.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళుండదు అని కామెంట్స్ పెడుతున్నారు.


Also Read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్‌.. టీజర్‌లో 'గాజు గ్లాస్‌' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!


Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter