Managalvaram: తన మొదటి చిత్రం ఆర్ఎక్స్ 100 తోనే ఎవరు ఊహించని బోల్డ్ కంటెంట్ తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆ తరువాత ఈ దర్శకుడు సిద్ధార్థ్, శర్వానంద్ తో మహాసముద్రం అనే సినిమా తీశారు. కానీ ఆ చిత్రం మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఈసారి ఎలాగైనా తాను నమ్ముకున్న బోల్డు కంటెంట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని.. తన ఆరోగ్యం పాయల్ రాజ్ పుత్ ని పెట్టి మంగళవారం అనే చిత్రంతో మనం ముందుకు వచ్చారు. ఆయన ఊహలకు తగట్టుగానే ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకునింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా మరోసారి పాయల్ ని ఎవరు ఊహించని క్యారెక్టర్ లో చూపించి విజయం సాధించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా పాజిటివ్ వైపు దూసుకుపోతూ ఉండటంతో.. శనివారం నాడు హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్ మీట్ అరేంజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన దర్శకుడు అజయ్ భూపతి.. ఈ సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ సినిమాలో సస్పెన్స్ గురించి బయటపెట్టిన ఒక రైతర్ పైన మాత్రం మంది పడ్డాడు.


ముందుగా మంగళవారం చిత్రం పై ఆయనకు ఉన్న నమ్మకాన్ని చెబుతూ..‌’మంగళవారం సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ చిత్రంలో నాకు RX 100 వైబ్స్ కనిపించాయి. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లకు విశేష ఆదరణ లభించింది. హీరో లేని సినిమా.. క్యారెక్టర్ బేస్డ్ మూవీ కదా అని విడుదలకు ముందు రెండు మూడు థియేటర్స్‌లో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. అయితే చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఏకంగా .. 12 థియేటర్స్‌‌లో షోస్ పెంచాల్సి వచ్చింది. కాగా ఈ చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించారు. RX 100 కంటే చాలా బాగుందని చాలామంది నాకు కాల్ చేసి మరి చెప్తున్నారు. మ్యూజిక్ చాలా బాగుందని.. క్లైమాక్స్ అసలు ఊహించలేము అని.. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు' అని చెప్పుకొచ్చారు.


ఆ తరువాత మీడియా వారి గురించి మాట్లాడుతూ కొంతమందికి థాంక్స్ చెప్పినా అజయ్ .. ఒక రివ్యూ రైటర్ పైన మాత్రం తన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ “: రివ్యూలు ఇచ్చిన వారి అందరికీ థాంక్స్. బాగా రాశారా.. రాయలేదా? దాని గురించి పక్కనపెడితే.. థాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే ‘నేను ఏదైతే రిక్వెస్ట్ చేశానో ట్విస్ట్‌ల గురించి.. క్లైమాక్స్ గురించి..క్యారెక్టర్స్ గురించి రివీల్ చేయొద్దని చెప్పానో.. నా మాటని గౌరవిస్తూ ఎవరూ ఎక్కడ కానీ వాటిని లీక్ చేయకుండా చేయకుండా హైడ్ చేసి ఉంచారు. వాళ్లందరికీ థాంక్స్. కానీ కొంతమంది మాత్రం అన్ ప్రొఫెషనల్స్ ఉంటారు.. ఫోన్ పట్టుకుని రోడ్డు మీద తిరిగే వారు ఉన్నారు. బాలాజీ అని ఒకడు ఉన్నాడు.. మాట్లాడితే నేను సీనియర్‌ని అని అంటాడు. కనీసం సెన్స్ లేకుండా పేపర్ పెట్టుకుని సినిమా కథ మొత్తం చదివి వినిపించేస్తున్నాడు. నచ్చడం నచ్చకపోవడం అనేది మీ ఇష్టం.. కానీ కొంతైనా కొంతైనా విలువలు పాటించాలి. ఒకరిద్దరు తప్పితే.. మిగిలిన రివ్యూ రైటర్స్ అంతా సినిమా గురించి చాలా బాగా చెప్పారు. వాళ్లకి చాలా థాంక్స్' అని చెప్పుకొచ్చారు.


ఇక తన హీరోయిన్ పాయల్ ని ప్రశంసిస్తూ.. ‘ ఈ సినిమాలో పాయల్ చేసిన రోల్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. నా సినిమాలో హీరోయిన్‌కి ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో బోల్డ్ పాత్ర నేను చాలామందికి హీరోయిన్స్ కి చెప్పినప్పుడు వారు పారిపోయారు. కానీ పాయల్.. ధైర్యంగా ముందుకు వచ్చింది. తాను డేరింగ్ యాక్టర్. మంగళవారం అనే సినిమా అలా వచ్చి వెళ్లిపోయేది కాదు.. RX 100 సినిమా ఎలాగైతే గుర్తిండిపోయిందో.. ఈ ‘మమంగళవారం కూడా అలాగే ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని చెప్పుకొచ్చారు అజయ్ భూపతి.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి