Ajay Bhupathi : మంగళవారం సినిమా టీజర్ తోనే అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆశ్చర్యపరుస్తూ మరోసారి అజయ్ భూపతి దగ్గర నుంచి ఆర్ఎక్స్ 100 రేంజ్ లో సినిమా వస్తుంది అనుకునేటట్టు చేసింది. కాగా ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుండగా.. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి సినిమా మేకర్స్ ఘనంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమా గురించి మరింత అంచనాలు పెంచేసారు దర్శకుడు అజయ్ భూపతి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..' సంవత్సరం క్రితమే అల్లు అర్జున్ గారికి నేను మంగళవారం సినిమా కథ మొత్తం చెప్పాను. ఒకరోజు కాదు.. రెండు రోజుల పాటు నన్ను పిలిపించుకుని కథ మొత్తం విన్నారు.. ఎలా తీస్తావ్ అజయ్ అని ఆయన అడిగినప్పుడు.. మీరు శెభాష్ అనేట్టుగానే తీస్తాను సార్ అని చెప్పాను. నేను అన్నట్టుగానే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నేను .. మా ఆఫీస్‌కి వచ్చేవాళ్లందరికీ చెప్తూ వస్తున్నా.. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీగారు గెస్ట్‌గా వస్తారని.. అయినా నాకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు వచ్చాడు.. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను' అని చెప్పకు వచ్చాడు.


ఇక ఆ తర్వాత మంగళవారం సినిమా గురించి మాట్లాడుతూ..'నేను తీసిన సినిమాలలో ఆర్ఎక్స్ 100 విజయం సాధించగా.‌ తదుపరి సినిమా మహాసముద్రం ఫ్లాప్ అయ్యింది... హిట్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది.. కానీ ఫ్లాప్ అయితేనే.. మొగుడు చచ్చిపోయిన ముండలా నన్ను చూసి పక్కకి పారిపోతుంటారు. అయితే ఒక్కటి చెప్తున్నా.. మహాసముద్రం సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా నేను ఈ మంగళవారం సినిమా తీసేశాడ్ని. ఎందుకంటే.. నేను ఏదైనా అనుకుంటే అదే చేస్తాను. ఈ చిత్రంలో హీరో లేదని ఈ సినిమా గురించి తక్కువ అంచనాలు వేసుకోకండి. ఈరోజు సినిమా మిక్సింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.. ఔట్ పుట్ చూస్తే గూస్ బమ్స్ అంతే. హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందంటే.. మీరు కుర్చీలలో కూర్చోలేరు.. పూనకాలు వచ్చేస్తాయి. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. షాక్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఈ సినిమా చూసిన వాళ్లు దయచేసి క్యారెక్టర్స్ రివీల్ చేయొద్దు.


ఈ చిత్రం జానర్ మనకి చాలా కొత్త.. ఇది ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే రస్టిక్ మిస్ట్రీరియస్ డార్క్ థ్రిల్లర్..చాలా కొత్త స్టోరీ.. సినిమాలో చాలా విషయం ఉంది కాబట్టే తమిళ్, మళయాలం, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఇందులో ఫిమేల్ ఒరియెంటెడ్ టచ్ అయ్యే కాంప్లికేటెడ్ పాయింట్ ఇందులో ఉంది. కథ రాస్తున్నప్పుడే నా చేతులు వణికాయి. ఇలాంటి పాయింట్ పైన ఇప్పటి వరకు ఇండియాలోనూ ఎవరూ ట్రై చేయలేదు. ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నా.. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ కథ అటు ఇటు అయితే ఏమౌతుందో నాకు తెలుసు... కానీ ఇలాంటి సబ్జెక్ట్‌ని డీల్ చేసినప్పుడే కదా.. మనం ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా నాకు పెద్ద ఛాలెంజ్. మహిళలందరికీ ఈ సినిమా నచ్చుతుంది. నవంబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.. తప్పక చూడండి’ అంటూ ఈ చిత్రం పైన అంచనాలలో మరింత పెంచేశారు అజయ్ భూపతి.


Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo