Bholaa Movie HD Print Leaked Online: అజయ్ దేవగన్ స్వతహాగా టైటిల్ పాత్రలో నటించి, డైరెక్ట్ చేసిన భోళా మూవీ చిత్ర యూనిట్ సభ్యులకు వెరీ బ్యాడ్ న్యూస్. బోళా మూవీ ఈ నెల 30న.. అంటే రేపే విడుదల కావాల్సి ఉండగా.. అంతకంటే కొన్ని గంటల ముందే ఇవాళ బోళా మూవీ ఆన్ లైన్ లో లీకైంది. అది కూడా ఫుల్ క్వాలిటీ ఉన్న HD ప్రింట్ లీక్ కావడంతో బోళా మూవీ నిర్మాతలు, దర్శకుడు అజయ్ దేవగన్ తలలు పట్టుకున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో అజయ్ దవగన్ కూడా ఒకరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిటిసి వెల్లడించిన వార్తా కథనం ప్రకారం టోరెంట్స్ సైట్స్ అయినటువంటి ఫిల్మీజిల్లా, మూవీరూల్స్, టెలిగ్రాం, తమిళ్ రాకర్స్ వంటి వెబ్‌సైట్స్‌లో ఈ సినిమా లీకైంది. భోళా ఫ్రీ డౌన్‌లోడ్, బోళా MP4 HD డౌన్‌లోడ్, భోళా తమిళ్ రాకర్స్, భోళా టెలిగ్రాం లింక్స్, భోళా మూవీ ఫ్రీ హెచ్‌డి డౌన్‌లోడ్, భోళా ఫ్రీ డౌన్‌లోడ్ లింక్ వంటి కీవర్డ్స్‌తో నెటిజెన్స్ సెర్చ్ చేస్తుండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కీవర్డ్స్ ట్రెండ్ అవుతున్నాయి.  అజయ్ దేవగన్ డైరెక్ట్ చేసిన బోళా మూవీని అజయ్ దేవగన్ ఫిలింస్, రిలియన్స్ ఎంటర్ టైన్మెంట్, T-సిరీస్ ఫిలింస్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వంటి అగ్రనిర్మాణ సంస్థలు నిర్మించాయి. తమిళంలో కార్తి హీరోగా వచ్చిన ఖైదీ మూవీని స్పూర్తిగా తీసుకుని భోళా పేరుతో హిందీలో రీమేక్ చేశారు.  


హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన అజయ్ దేవగన్ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రాల్లో ఇది నాలుగవది. 2008 లో యు మి ఔర్ హమ్ మూవీ, 2016 లో శివాయ్ మూవీతో పాటు గతేడాది రిలీజైన రన్ వే 34 వంటి చిత్రాలు అజయ్ దేవగన్ డైరెక్ట్ చేసినవే కాగా తాజాగా బోళా మూవీతో దర్శకుడిగా తన ఖాతాలో 4వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. తెల్లవారితే  ఈ సినిమా ఫలితం తేలుతుందన్న ఎగ్జైట్మెంట్ లో ఉన్న అజయ్ దేవగన్ కి, మొత్తం మూవీ యూనిట్ కి బోళా మూవీ లీకైందన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 



 


జైలు శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ తన కూతురుని కలిసేందుకు వెళ్లే క్రమంలోనే అనుకోకుండా పోలీసులకు, డ్రగ్ మాఫియాకు మధ్య జరుగుతున్న ఘర్షణలో చిక్కుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనే కథనంతో ఖైదీ మూవీ తెరకెక్కింది. అజయ్ దేవగన్‌ టైటిల్ లీడ్ రోల్ పోషించగా.. టబు, అమలా పాల్, దీపక్ దోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావ్, కిరణ్ కుమార్, మకరండ్ దేశ్ పాండే, వినిత్ కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.


ఇది కూడా చదవండి : Dasara Twitter Review: దమ్ము చూపిస్తున్న దసరా... నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే?


ఇది కూడా చదవండి : Telugu Movie Gets 700 Mn Views: బాప్‌రే.. బెల్లంకొండ సినిమాకు 700 మిలియన్ వ్యూస్


ఇది కూడా చదవండి : Samantha Marriage Life: మ్యారేజ్ లైఫ్లో 100% ఇచ్చా..ఆ సీన్ చేయమన్న వారే సాంగ్ వద్దన్నారు..సమంత సంచలనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK