Dasara Twitter Review: బాంచత్.. దమ్ము చూపిస్తున్న దసరా.. నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే..?

Nani 's Movie Darasa Twitter Review Telugu: నాని హీరోగా నటించిన దసరా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనే వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 30, 2023, 07:47 AM IST
Dasara Twitter Review: బాంచత్.. దమ్ము చూపిస్తున్న దసరా.. నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే..?

Nani's Darasa Twitter Review: నాని హీరోగా నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ దసరా ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మన దేశంలో ఇంకా ప్రీమియర్స్ పడలేదు కానీ అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్స్ పడడంతో టాక్ ఎలా ఉందనే విషయం బయటకు వచ్చింది. ఇక ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. నాని పెర్ఫార్మన్స్ గురించి కూడా ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు.

సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ముందు నుంచి ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలోని గోదావరిఖని ప్రాంతానికి సంబంధించిన బాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని మాత్రమే కాకుండా దీక్షిత్ శెట్టి, సముద్రఖని, మలయాళ నటుడు షైన్ చామ్ టాకో వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక సినిమా ఎలా ఉందనే విషయాన్ని ట్విట్టర్లో యూజర్లు కామెంట్లు చేస్తున్నారు దాని ప్రకారం చెక్ చేద్దాం. 

 

ఇక సినిమా చూసిన వారు చెబుతున్న దాని ప్రకారం సినిమా మొదటి భాగం కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది కానీ నాని తనదైన స్టైల్ లో నడిపించాడని సినిమా మొత్తాన్ని నాని ఆక్రమించి తనదైన శైలిలో ముందుకు నడిపించాడని చెబుతున్నారు. కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయని సంతోష్ నారాయణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది అని చెబుతున్నారు. యూఎస్ కి సెన్సార్ ఇష్యూ అయితే రాలేదని కామెంట్లు చేస్తున్నారు. .

ఇక నాని కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్టు అనిపించినా  అద్భుతంగా సీక్వెన్స్ లు కుదిరాయని, ఎమోషనల్ గా కూడా బాగా డ్రామా వర్కౌట్ అయిందని క్లైమాక్స్ అయితే మరింత అద్భుతంగా కుదిరిందని కీర్తి సురేష్ కూడా ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అయిందని కామెంట్లు చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 

సినిమా కొన్నిచోట్ల స్లో అయినట్లు అనిపిస్తుంది కానీ మొత్తం మీద చూసుకుంటే అద్భుతంగా ఉందని ముఖ్యంగా ప్రీ  క్లైమాక్స్ అయితే అసలు అదిరిపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతా సినిమాటోగ్రాఫర్, సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ కి క్రెడిట్స్ ఇవ్వాలని వాళ్లు సినిమాని మరో లెవల్ కు తీసుకువెళ్లారని అంటున్నారు. నాని తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని కీర్తి కూడా అంతే రచ్చగా నటించిందని అంటున్నారు.

ఇక ఒక మీమ్ పేజీ అయితే ఈ సినిమాకి రివ్యూ ఇవ్వాలని అనుకోవడం లేదని సినిమాలో పాయింట్ కన్నా నాని, కీర్తి సురేష్ పర్ఫామెన్స్ అద్భుతంగా కుదిరిందని పేర్కొంది. నాని కెరియర్ బెస్ట్ ఇచ్చాడని మ్యూజిక్ తమకు నచ్చలేదు కానీ సినిమాటోగ్రఫీ మాత్రం వేరే లెవెల్ లో ఉందని చెబుతున్నారు.

మరొక నెటిజన్ అయితే విజిల్స్ సినిమా చూస్తున్నంత సేపు వేస్తూనే ఉంటారని నాని కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాతో ఇచ్చారని, నాని కెరియర్ ని దసరా ముందు దసరా తర్వాత అంటూ ఇకమీదట మాట్లాడతారని సినిమా మొత్తం మీద క్లైమాక్స్ అయితే అద్భుతంగా కుదిరిందని కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి రూమర్లు రివ్యూస్ చదవద్దని టైం వేస్ట్ చేసుకోకుండా సినిమాకి వెళ్ళిపోమని చెబుతున్నారు. యావరేజ్ గా యూజర్ లందరూ కలిసి మూడున్నర నుంచి ఐదు వరకు రేటింగ్ ఇస్తూ ఉండడంతో నాని అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. మా హీరో హిట్టు కొట్టాడని ఆనందపడుతున్నారు ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.
Also Read: Samantha Marriage Life: మ్యారేజ్ లైఫ్లో 100% ఇచ్చా..ఆ సీన్ చేయమన్న వారే సాంగ్ వద్దన్నారు..సమంత సంచలనం!

Also Read: Shreya Dhanwanthary: అన్ని హద్దులు చెరిపేసిన శ్రేయ ధన్వంతరి.. తెలుగమ్మాయి హాట్ షో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

More Stories

Trending News