Music Shop Murthy: రెండు ఓటీటీల్లో అదరగొడుతున్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. టాప్‌లో ట్రెండింగ్
Music Shop Murthy Movie OTT: మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అజయ్ ఘోష్ యాక్టింగ్‌కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.
Music Shop Murthy Movie OTT: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. ఈ మూవీకి థియేటర్లలో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్‌లో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో సందడి మొదలుపెట్టింది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటూ ఓటీటీ సంస్థల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read: డబుల్ ఇస్మార్ట్ చిత్ర బృందానికి బిఆర్ఎస్ వార్నింగ్.. తొలగించకపోతే..?
ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి ఇతర పాత్రలను పోషించారు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, పవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు. సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన ఆడియన్స్ ఓటీటీలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అజయ్ ఘోష్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన నెక్ట్స్ లెవెల్ అంటున్నారు.
కథ ఏంటంటే..?
మూర్తి (అజయ్ ఘోష్) పాత మ్యూజిక్ షాప్ నడిపిస్తుంటాడు. అయితే ఇంటర్నెట్ రాకతో ఆయన వ్యాపారానికి గండిపడుతుంది. బిజినెస్ అంతంత మాత్రమే జరుగుతుండడంతో మూర్తి భార్య జయశ్రీ (ఆమని) సెల్ ఫోన్ షాప్ పెట్టాలని ఒత్తిడి చేస్తుంది. అయితే తనకు ఈ పని మాత్రమే తెలుసంటూ భార్య మాటలను పట్టించుకోడు మూర్తి. ఈ క్రమంలో అంజనా (చాందిని చౌదరి) తన డీజే ఇన్‌స్ట్రుమెంట్ రిపేర్ కోసం మూర్తి దగ్గరకు వస్తుంది. ఆ పరిచయంతో అంజనా దగ్గర మూర్తి డీజే ఎలా వాయించాలో నేర్చుకుంటాడు. డీజే అయితే డబ్బు బాగా సంపాదించవచ్చనే ఆశతో 52 ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు వస్తాడు. మరీ మూర్తి డీజే అయ్యాడా..? నగరంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ స్టోరీ.
Also Read: Love Breakup Tips: మీకు బ్రేకప్ అయ్యిందా? లవ్ ఫెయిల్ నుంచి బయటపడే మార్గాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి