Double Ismart Update: తాజాగా రామ్ పోతినేని హీరోగా.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాదు ప్రముఖ హీరోయిన్, నిర్మాత ఛార్మీ కౌర్ తో కలిసి 'పూరీ కనెక్ట్స్ 'పతాకంపై నిర్మిస్తున్నారు కూడా. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా, తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేసింది.. "మార్ ముంత.. చోడ్ చింత ".. అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకుందని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళితే ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ని ఉపయోగించడంతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.. పూరి జగన్నాథ్ పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు కూడా మండిపడుతున్నారు.. ఈ పాటలో కల్లు కాంపౌండ్ దగ్గర హీరో , హీరోయిన్ బాటిల్లు పట్టుకొని చిందేస్తూ ఉంటారు.. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊతపదం "ఏం జేద్దామంటవ్ మరీ.."అనే పదాన్ని యథాతథంగా ఆయన వాయిస్ ని ఇక్కడ ఉపయోగించారు.
కెసిఆర్ అంటే తాగుడు.. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా పాట మధ్యలో ఆయన టోన్ ను ఉపయోగించారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ కల్చర్ను తాగుడు సంస్కృతిగా ప్రొజెక్ట్ చేసేలా ఈ పాట ఉందని కేసీఆర్ అభిమానులు కామెంట్లు చేయడమే కాదు వెంటనే ఈ పదాన్ని తొలగించాలని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
ఈ పాటలో కేసీఆర్ పదాన్ని ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు..ఒక దర్శకుడు తన అభిరుచితో తెరకెక్కించడంలో తప్పులేదు.. కానీ రాష్ట్రానికి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్వరాన్ని ఇందులో ఉపయోగించడం అంటే ఆయనను అవమానించడమే అంటూ కేసిఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణవాదులు తీవ్ర విమర్శలు చేస్తూ పూరి జగన్నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు ఈ పాట రచయిత కాసర్ల శాంత తో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన వారే.. అయినా కేసీఆర్ హుక్ లైన్ ను ఎందుకు రాయాల్సి వచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు.. వెంటనే ఈ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కూడా.. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందించకుండా చూడాలి.
Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం
Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి