Thegimpu Twitter Review  అజిత్ హెచ్ వినోద్ కాంబోలో వచ్చిన తునివు (తెలుగులో తెగింపు) సినిమాకు ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా బ్యాంకులు చేసే మోసాల చుట్టూ తిరుగుతుందట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అజిత్ మేనియా అని, సెకండాఫ్‌లోనే అసలు కథ ఉంటుందని, బ్యాంక్‌లు చేసే ఫ్రాడ్స్‌ను వేలెత్తి చూపేలా ఉంటుందని అంటున్నారు. ఇంచు మించుగా ఇది మన సర్కారు వారి పాట లైన్ అని కూడా జనాలు అంటున్నారు. అయితే ఈ సినిమా మాత్రం అజిత్ వన్ మెన్ షో అని, బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ తేల్చి చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అజిత్ కుమార్ విశ్వరూపం ఇది.. వన్ మెన్ షో.. ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయ్.. ఈ పొంగల్‌కు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అజిత్ అని ట్వీట్లు కనిపిస్తున్నాయి. శంకర్ స్టైల్లో హెచ్ వినోద్ సినిమాను తీస్తే ఎలా ఉంటుందో అదే తునివు.. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌తో అజిత్ కుమార్ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు.. అయితే విలన్లు మాత్రం తేలిపోయారట. 


 



ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూడాలి.. అప్పుడే మీకు డబ్బు విలువ తెలుస్తుంది.. హెచ్ వినోద్ అద్బుతంగా కథను రాసుకున్నాడు అని ఓ నెటిజన్ ట్వీట్ పెట్టేశాడు. తునివు బ్లాక్ బస్టర్ అని జనాలంతా అంటున్నారు. అజిత్‌కు చాలా రోజుల తరువాత అసలు సిసలైన బ్లాక్ బస్టర్ హిట్ పడింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


 



 పండుగ వాతావరణం మొదలైంది.. ఎప్పుడైనా కంటెంట్ విన్ అవుతుందని మరోసారి నిరూపితమైంది.. థాంక్యూ హచ్ వినోద్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు ఈ సినిమా గురించి నెగెటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు. సీజీ వర్క్ బ్యాడ్‌గా ఉందని, క్యాస్టింగ్ సెట్ అవ్వలేదని, బీస్ట్ అనే సినిమాను చూసి కూడా మళ్లీ అదే ఫార్మాట్లో ఎలా తీస్తారు అని అడుగుతున్నారు.. నా డబ్బులన్నీ వేస్ట్ అయ్యాయ్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టేశాడు.


 



 


Also Read: Varun Dhawan-Samantha : ఒక్కసారి సమంతను కలిస్తే తెలుస్తుంది.. అండగా నిలిచిన బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్


Also Read: Ramya Krishnan Pics : హాట్ లుక్కులో రమ్యకృష్ణ.. సీనియర్ నటి పోజులు చూస్తే దిమ్మతిరగాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి