Akhil Akkineni Agent SiX Pack అఖిల్ అక్కినేని హీరోగా నిలదొక్కుకున్నాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ కొట్టేశాడు. అంతకు ముందు చేసిన మూడు సినిమాలు బోల్తా కొట్టాయి. అలా ఇక మొదటి హిట్టుగా బ్యాచ్‌లర్ సినిమా పడింది. పూజా హెగ్డేతో కలిసి చేసిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఓకే అనిపించింది. అలా అఖిల్ ఖాతాలో మొదటి హిట్ పడ్డట్టు అయింది. అయితే అఖిల్ తన తదుపరి చిత్రం కోసం బాగానే కష్టపడుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఖిల్ తన కొత్త సినిమా ఏజెంట్ కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ బాడీ పెంచాడు. సిక్స్ ప్యాక్ లుక్ కోసం పిచ్చెక్కేలా కష్టపడుతున్నాడు. అఖిల్ తన ఏజెంట్ సినిమా కోసం బాగానే వర్కౌట్లు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. మధ్యలో అయితే ఈ చిత్రం ఆగిపోయిందంటూ రూమర్లు వచ్చాయి. నిర్మాత, బడ్జెట్‌ ఎక్కువ అవుతోందనే కారణంతో ఆపేశారంటూ కథనాలు వచ్చాయి.


 



మొత్తానికి ఏజెంట్ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా షూటింగ్ చేస్తోన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏజెంట్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం అందరినీ మెప్పించింది. అఖిల్ ఇది వరకంటే చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. తాజాగా అఖిల్ తన కొత్త లుక్కుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు.


ఇందులో అఖిల్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎవడ్రా హృతిక్ రోషన్.. మాకు అయ్యగారు ఉన్నారు అంటూ అఖిల్‌ ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అఖిల్ బాడీ పెంచిన తీరు చూసి అంతా ఫిదా అవుతున్నారు. సిక్స్ ప్యాక్ లుక్ చూసి.. ఆ నరాలు ఏంట్రా బాబు అని షాక్ అవుతున్నారు.


Also Read: Rakul Preet Pics : రకుల్ బీచ్ ఫోటోలు.. న్యూ ఇయర్ హ్యాంగవుట్‌.. పిక్స్ వైరల్


Also Read: Sreeja Konidela : ఆ వ్యక్తిని కనుగొన్నా.. కొత్త జీవితానికి ఆరంభం ఇదే.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి