Sreeja Konidela : ఆ వ్యక్తిని కనుగొన్నా.. కొత్త జీవితానికి ఆరంభం ఇదే.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్

Sreeja Konidela New Soulmate శ్రీజ కొణిదెల వివాహాల సంగతి తెలిసిందే. శ్రీజ మొదటి పెళ్లి బెడిసి కొట్టేసింది. రెండో పెళ్లి సైతం కలిసి రాలేదు. ఇప్పుడు రెండో పెళ్లి రద్దు అయినట్టు తెలుస్తోంది. ఆ మధ్య అయితే మూడో పెళ్లి మీద కూడా రూమర్లు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 11:18 PM IST
  • శ్రీజ కొణిదెల కొత్త సోల్ మేట్
  • కొత్త జీవితం ఆరంభం అంటూ పోస్ట్
  • ఇక ఎప్పటికీ ఒంటరిగానే ఉంటుందా?
Sreeja Konidela : ఆ వ్యక్తిని కనుగొన్నా.. కొత్త జీవితానికి ఆరంభం ఇదే.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్

Sreeja Konidela New Soulmate మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆమె మొదటి వివాహాం విడాకులతో ముగిసింది. మొదటి భర్త వల్ల నివృత్తి పుట్టింది. రెండో భర్త వల్ల నవిష్క పుట్టింది. అయితే ఇప్పుడు శ్రీజ రెండో పెళ్లి కూడా విడాకుల వరకు వెళ్లిందని, అందుకే వేర్వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య నవిష్క బర్త్ డేకు అయితే కళ్యాణ్‌ దేవ్ వేసిన పోస్ట్ చూసి అందరూ ఎమోషనల్ అయ్యాడు. తన కూతుర్ని కూడా తాను చూసుకోలేని స్థితిలో కళ్యాణ్‌ దేవ్ ఉన్నాడని అందరికీ అర్థమైంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeja (@sreejakonidela)

డియర్ 2022, నా జీవితంలోని అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని తెలిసేలా చేశావ్.. అందుకే థాంక్స్.. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి.. నన్ను బాగా, అమితంగా ప్రేమించే వ్యక్తి.. నన్ను ఎప్పుడూ కేరింగ్‌గా చూసుకునే వ్యక్తి.. నాకు సపోర్టివ్‌గా ఉండే వ్యక్తి.. నా కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తి.. డియర్ మీ.. చివరకు నిన్ను కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది.. కొత్త ప్రయాణం మొదలు అంటూ తన గురించి తాను చెప్పుకుంది.

తనలోని తనను గుర్తించానని, తనను తన కంటే ఎవ్వరూ బాగా అర్థం చేసుకోలేరని ఇలా పరోక్షంగా చెప్పేసింది శ్రీజ. మొత్తానికి శ్రీజ ఇకపై ఒంటరిగానే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు శ్రీజ అయితే కళ్యాణ్ దేవ్‌కు దూరంగా ఉంటోంది. నవిష్కను సైతం శ్రీజ తన వద్దే ఉంచుకున్నట్టుగా అనిపిస్తోంది. కళ్యాణ్ దేవ్ అయితే తన బిడ్డ బర్త్ డేను కూడా సెలెబ్రేట్ చేసుకోలేకపోయాని అర్థమవుతోంది.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News