Akhil Akkineni: రాయలసీమ ప్రేమకథతో రానున్న అఖిల్ అక్కినేని.. కథలో పెద్ద ట్విస్ట్ ఇదే..!
Akhil Akkineni next film: అక్కినేని వారసులలో మరీ వెనక పడున హీరో ఎవరు అంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు అఖిల్ అక్కినేని. సినిమాల్లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. ఇంకా కూడా ఈ అక్కినేని వారసుడికి సరైన గుర్తింపు రాలేదు. అంతే కాదు కనీసం సరైన విజయం కూడా రాలేదు. ఈ క్రమంలో ఈ హీరో ఇప్పుడు సరికొత్త ప్రేమ కథతో రానున్నారు.
Akhil Akkineni Upcoming movie: అక్కినేని హీరోలు అందరూ ప్రస్తుతం వరస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా మూడోతరం వారసుడు అఖిల్కి ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సైతం ఒక మోస్తారు విజయం సాధించిందే కానీ.. అఖిల్ కి కావాల్సిన అంత స్టార్ డం తెచ్చి పెట్టలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఒకసారి కొత్త ప్రేమ కథతో సిద్ధమవుతున్నారట ఈ హీరో.
‘ఏజెంట్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైన తరువాత, అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమా గురించి సుమారు ఒకటిన్నర సంవత్సరంగా..మౌనంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మౌనం తొలగిపోయినట్టే. అఖిల్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
ఇక ఈ సినిమా కథ గురించి ప్రస్తుతం ఒక వార్త సినీ వర్గాల్లో ఎంతో బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో జరుగుతుందట. ఈ సినిమాకి వినరో భాగ్యం విష్ణు కథ’ ద్వారా మంచి డెబ్యూ అందుకున్న మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తారు.
సాధారణంగా అఖిల్ సినిమాలు మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు కొంచెం దగ్గరగా ఉంటాయి. కానీ ఈసారి రాయలసీమ నేపథ్యం ఎంచుకోవడంతో ఈసారి అఖిల్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అఖిల్ రాయలసీమ యాస మాట్లాడబోతున్నట్లు వినికిడి. ఈ చిత్రంలో అఖిల్ గెటప్, స్లాంగ్ పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోందని.. అదే ఈ సినిమాకి పెద్ద ట్విస్ట్ అని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను అక్కినేని వారి ఇంటి ప్రొడక్షన్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘హలో’ తర్వాత మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న అర్జున్ రెండోవ చిత్రం. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ స్వరాలు అందించనున్నారు. మరి ఈ చిత్రమైన అఖిల్ కి.. కావలసిన విజయం అందిస్తుందో లేదో వేచి చూడాలి.
Also Read: Korutla MLA Padayatra: కేటీఆర్ యాత్రకు ముందే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర
Also Read: Revanth Reddy Scam: ఢిల్లీలో బాంబు పేల్చిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి