Revanth Reddy Scam: ఢిల్లీలో బాంబు పేల్చిన కేటీఆర్‌.. రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలు

KT Rama Rao Reveals Revanth Reddy AMRUT 2.0 Scam: అనుకున్నట్టుగానే ఢిల్లీ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ బాంబు పేల్చారు. జాతీయ మీడియా ముందు రేవంత్‌ రెడ్డి అవినీతిని బట్టబయలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 12, 2024, 11:42 AM IST
Revanth Reddy Scam: ఢిల్లీలో బాంబు పేల్చిన కేటీఆర్‌.. రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలు

KT Rama Rao Press Meet: రాజ్యాంగానికి విరుద్ధంగా.. సొంత కుటుంబసభ్యులకు టెండర్లు ఇచ్చి రేవంత్‌ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బాంబు పేల్చారు. బావమరిదికి అమృతం పంచి కొడంగల్‌ ప్రజలకు విషం పంచిన రేవంత్‌ రెడ్డి గద్దె దిగాల్సిందేనని స్పష్టం చేశారు. వెంటనే రేవంత్‌ అవినీతి ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి అమృత్‌ కుంభకోణంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: Collector Attack: కొడంగల్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు రైతుల్లో ఆగ్రహం.. పూర్తి వివరాలు ఇవే!

కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాలు.. రేవంత్‌ రెడ్డి అవినీతిపై ఢిల్లీ స్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్‌ పోరాటం మొదలుపెట్టారు. అమృత్‌ టెండర్లపై సోమవారం కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు ఫిర్యాదు చేసిన కేటీఆర్ మంగళవార ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రేవంత్‌ రెడ్డి కుటుంబం అవినీతికి పాల్పడిందని మరోసారి కేటీఆర్‌ ఆరోపించారు. ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ కింద రాజ్యాంగానికి విరుద్ధంగా అమృత్‌ టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్‌ వివరించారు. త్రిబుల్‌ ఆర్‌ (రాహుల్‌, రేవంత్‌ ట్యాక్స్‌) అని చెబుతున్న ప్రధానమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

Also Read: Amruth Scam: రేపు బాంబు పేల్చనున్న కేటీఆర్‌.. రేవంత్ రెడ్డి అవినీతిపై ఢిల్లీస్థాయిలో పోరాటం

'అర్హత లేకపోయినా సీఎం బావమరిది శోధా కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు కేటాయించారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.2 కోట్ల లాభం చూపించిన కంపెనీకి రూ.1,137 కోట్ల ప్రాజెక్టు ఎలా అప్పగిస్తారు' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి సొంతవారికి దోచిపెడుతున్న రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు. తాము తప్పకుండా ఢిల్లీకి వచ్చి రేవంత్‌ ప్రభుత్వం అవినీతిపై తప్పక ఫిర్యాదు చేస్తామని.. మళ్లీ మళ్లీ ఢిల్లీ వచ్చి కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ అవినీతిపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. మరిన్ని అవినీతి బండారాలు బయటపెడతామని సంచలన ప్రకటన చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డితోపాటు పౌరసరఫరాల శాఖ కుంభకోణంపై కూడా ఫిర్యాదు చేస్తామని వివరించారు. మేం ఢిల్లీకి వస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News