Nagarjuna In Brahmastra Movie: టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్న నాగ్ అంతలోనే టాలీవుడ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. ప్రేమ పక్షులు రణబీర్ కపూర్, అలియా భట్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) సీన్లకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి కాగా, ఈ మేరకు ట్విట్టర్‌లో అప్‌డేట్ అందించారు నాగార్జున.


Also Read: Sumanth Ashwin Wedding Photos: ఘనంగా టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ వివాహం



రణబీర్ కపూర్, ఆర్ఆర్ఆర్(RRR Movie) ఫేమ్ అలియాభట్‌‌లతో కలిసి దిగిన ఫొటోలను సైతం నాగార్జున పోస్ట్ చేశారు. మరోవైపు కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన షూటింగ్‌ను తాజాగా నాగ్ పూర్తి చేసుకున్నారు. రణబీర్, అలియా లాంటి టాలెంటెడ్ నటులతో పనిచేశానని కామెంట్ చేశారు. అంతలోనే గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ కొత్త సినిమా మొదలైంది.


Also Read: Keerthy Suresh wedding: అనిరుద్ రవిచందర్‌తో కీర్తి సురేష్ పెళ్లంట!


నాగ్, ప్రవీణ్ సత్తారు మూవీకి సంబంధించి నేడు హైదరాబాద్‌(Hyderabad)లో పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, శరత్ మరార్‌కు చెందిన నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో అందించనున్నారు.


Also Read: Janhvi kapoor: శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్హవిని ఇలా చూస్తే..అంతే ఇక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook