Nagarjuna N Convention Center Demolished in Hyderabad: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవమన్మధుడు అక్కినేని నాగార్జున గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఈ మధ్యకాలంలో కొడుకులతో సమానంగా సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిన నాగార్జున  ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ షో కి హోస్టుగా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా ఇటీవల తన కొడుకు నాగచైతన్యకు నచ్చిన అమ్మాయి శోభితతో నిశ్చితార్థం జరిపించిన విషయం తెలిసిందే. అంతే కాదు వారిద్దరికీ సంబంధించిన నిశ్చితార్థ వేడుక ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఇద్దరికీ నిశ్చితార్థం చేసినట్లు అధికారిక ప్రకటన కూడా చేశారు 


అయితే ఇదిలా ఉండగా తాజాగా అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, చెరువులు కబ్జాపై వేటు వేస్తున్న హైడ్రా భారీ బిల్డింగులు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్నారు. ఇందులో ఎంతటి వారైనా సరే వదిలిపెట్టడం లేదు.  హైడ్రా చర్యల్లో భాగంగా మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో అక్రమ నిర్మాణాలను ఉదయం నుంచి సిబ్బంది తొలగిస్తున్నారు. 


భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు కూడా జరుగుతున్నాయి.  మరొకవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను కూడా పోలీసులు మూసివేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి అనుమతి లేదంటూ భారీ కేడ్లను కూడా ఏర్పాటు చేశారు. కూల్చివేత ప్రాంతం దగ్గరికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. 


గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. ఇప్పుడు వాటిని గుర్తించి వెంటనే కూల్చేస్తోంది. అందులో భాగంగానే నాగార్జునకు సంబంధించి మాదాపూర్ లో 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం ఉంది.


మొత్తం మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని, గతంలోని ఈ నిర్మాణం పై చర్యలు తీసుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు హీరో నాగార్జున తిమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేస్తూ అక్కినేని ఫ్యామిలీకి షాక్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అధికారులు. ఇక దీనిపై అక్కినేని హీరో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


Also Read: YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి


Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter