Akkineni Nagarjuna, Naga Chaitanya's Bangarraju Movie first review and censor report : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్‌‌గా తెరకెక్కిన తాజా మూవీ బంగార్రాజు. (Bangarraju Movie) కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాగార్జున, నాగ చైతన్యలకు (Naga Chaitanya) జోడీగా రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు.. బంగార్రాజుపై భారీగానే అంచనాలు పెంచేశాయి. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఐటెం సాంగ్ కూడా అదిరిపోయిన విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీలో హుషారు, జాంబీ రెడ్డి సినిమాల్లో నటించిన దక్ష నగార్కర్ కూడా మరో స్పెషల్‌ సాంగ్‌లో (Special song) నటించింది. 


నాగార్జున సొంత బ్యానర్‌‌లో నిర్మించిన ఈ మూవీకి అనూప్ రూబెన్స్ (Anoop Rubens) మ్యూజిక్ అందించారు. ఈ సంక్రాంతి బరిలో నుంచి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మూవీలు తప్పుకోవడంతో బంగార్రాజుకి (Bangarraju) కలిసి వస్తుందనే టాక్ వినపడుతోంది. 


2016లో సంక్రాంతి (sankranthi) సందర్భంగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన (Soggade Chinninayana) మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ అందుకుంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కెరియర్‌‌లో ఆ చిత్రమే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. కుటుంబ నేపథ్యం ఉన్న మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ (Family Audience) క్యూ కట్టారు. ఇక ఇప్పుడు బంగార్రాజు మూవీకి కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందని మూవీ యూనిట్ నమ్మకంతో ఉంది. ఆరేళ్ల తర్వాత మొత్తానికి మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచింది నాగ్ మూవీ. మనం చిత్రం తర్వాత నాగార్జున, నాగ చైతన్యల (Naga Chaitanya) కాంబోలో మళ్లీ మూవీ రావడంతో బంగార్రాజుపై అంచనాలు పెరిగాయి.



బంగార్రాజు మూవీ సెన్సార్ (Sensor) పనులన్నీ పూర్తి అయ్యాయి. బంగార్రాజు సినిమాను చూసిన కొందరు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుందని టాక్ వచ్చింది.సోగ్గాడే చిన్నినాయన మూవీలో నాగార్జున ఎలా అయితే సరదా సన్నివేశాలతో అలరించాడో బంగార్రాజు సినిమాలో కూడా నాగచైతన్య అదే తరహాలో ఆకట్టుకున్నారట. కృతి శెట్టితో చై.. రొమాన్స్ బీభత్సంగా ఉందంట. ఫస్టాఫ్‌లో మొత్తం నాగచైతన్య డిఫరెంట్‌గా కనిపిస్తాడని టాక్ వచ్చింది.



ఇక బంగార్రాజు మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ (Visual effects) హైలైట్‌ అట. దాదాపు అరగంట పాటు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ ఉన్నాయట. అనుకోకుండా వచ్చిన గుడి సమస్యకు బంగార్రాజు ఆత్మతో పాటు యువ బంగార్రాజు నాగచైతన్య అడ్డుగా నిలిచే సన్నివేశాలు బాగున్నాయట. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. అనూప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (Background music) అదిరిపోయిందట.



 


Also Read :  AP Corona cases: ఏపీలో భారీగా పెరిగన కరోనా కేసులు- ఒక్క రోజులో 840 మందికి పాజిటివ్​


బంగార్రాజు మూవీలో క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉందని టాక్ వచ్చింది. క్లైమాక్స్‌లో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్బ్‌గా ఉన్నాయని తెలిసింది. పాముకి సంబంధించిన సీన్స్ బాగున్నాయట. భక్తితో పాటు ఎమోషనల్‌ను కూడా బాగా తెరకెక్కించారట కల్యాణ్ కృష్ణ. (Kalyan Krishna) శివాలయంలో జరిగే యాక్షన్ సీన్ అద్భుతమట. సోగ్గాడే చిన్నినాయన మూవీ తరహాలోనే బంగార్రాజు (Bangarraju) చిత్రం కూడా ఈ సంక్రాంతి సీజన్‌లో సూపర్‌‌హిట్ నిలవనుందని టాక్.




Also Read :  AP PRC: ఏపీ ప్రభుత్వం గుడ్​ న్యూస్​- ఉద్యోగులకు పీఆర్​సీ ప్రకటన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి