Naa Saami Ranga: అంచనాలు తారుమారు చేసిన నాగార్జున.. ఈసారి హిట్ దక్కేనా
Nagarjuna: ఒకపక్క డిజాస్టర్స్ ..మరొక పక్క..సంవత్సరం నుంచి ఇంకే మూవీ తీయలేదు.. ఈ నేపథ్యంలో ఇక నాగార్జున మూవీస్ ఆపేస్తాడు అన్న రూమర్స్ వచ్చే సమయంలో.. నా సామిరంగా చిత్రంతో అందరిని సర్ప్రైజ్ చేశాడు కింగ్ నాగ్.
Telugu Sankranthi Releases 2024: అక్కినేని నాగార్జున.. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా ఉండే హ్యాండ్సమ్ నవమన్మధుడు. అయితే 2016 తర్వాత ఈ సోగ్గాడి ఖాతాలో మంచి సూపర్ హిట్ చిత్రం ఒక్కటి కూడా లేదు. 2016 సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్నినాయన మూవీ నాగార్జునకు మంచి సక్సెస్ తెచ్చింది.. ఆ తర్వాత వచ్చిన దేవదాసు, బంగార్రాజు లాంటి సినిమాలు కాస్త ఊరట కలిగించినా మిగిలిన అన్ని సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఇక అక్కినేని నాగార్జున మార్కెట్ క్లోజ్ అయిపోతుంది అని చిలక జోస్యం చెప్పారు. కాగా ఈ పరిస్థితి నుంచి నాగార్జున ఎలా బయటికి వస్తాడో చూద్దాం ? అని ఎదురుచూసిన వాళ్ళు ఉన్నారు.
దానికి తోడు నాగార్జున ఒక సంవత్సరం పైన ఏ సినిమా చేయలేదు. దీంతో నాగార్జున ఇంక తన సినీ కెరీర్ కి బ్రేక్ తీసుకుంటాడేమో అన్న రూమర్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇటు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య ,అఖిల్ ఇద్దరి కెరీర్ కూడా అంతంత మాత్రంగా ఉంది. దీంతో అక్కినేని అభిమానులు తెగ ఆందోళన చెందారు. ఇక అక్కినేని మన్మధుడు తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం పూర్తిగా అసాధ్యం అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అతి తక్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి నా సామి రంగా అంటూ దిగుతున్నాడు నాగార్జున.
పక్కాగా పండక్కి సెట్ అయ్యే సినిమాతో.. పండగ మొత్తాన్ని తన సినిమాతో పాటుగా తీసుకొని రావడానికి నాగార్జున ఫిక్స్ అయిపోయాడు. పండక్కి పోటీ గట్టిగానే ఉన్నా ..మూవీ పై ప్రేక్షకులలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. దీంతో బయ్యర్లు కూడా సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకే కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం పండక్కి వచ్చే సినిమాలలో గుంటూరు కారం ,హనుమాన్ చిత్రాల తర్వాత ఆ రెంజ్ టాక్ ఉన్నది నా సామి రంగ మూవీకి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. విడుదల అయ్యాక కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే చాలు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టే సత్తా ఉన్న మూవీ నా సామి రంగా అని ట్రేడ్ పండితుల అంచనా. మరి ఈ మూవీ తో నాగార్జున ఎటువంటి ఫలితాలు సాధిస్తాడో చూడాలి.
Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook