Akshay Kumar Lehenga: లెహంగా ధరించి.. హీరోయిన్‌తో డాన్స్ చేసిన స్టార్ హీరో! ఊపుడు మాములుగా లేదుగా
Akshay Kumar and Nora Fatehi Dance Video in US. `సెల్ఫీ` చిత్రంలోని మే ఖిలాడీ పాటకు బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, నోరా ఫతేహి కలిసి చిందేశారు.
Akshay Kumar and Nora Fatehi Dance Performance in Atlanta Goes Viral: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తతం యూఎస్ పర్యటనలో ఉన్నాడు. 'అక్షయ్ ది ఎంటర్‌టైనర్స్' టూర్‌లో నోరా ఫతేహి, దిశా పటానీ, మౌనీ రాయ్, సోనమ్ బజ్వా, అపర్శక్తి ఖురానా సహా పలువురు సెలబ్రిటీలు భాగం అయ్యారు. బాలీవుడ్ స్టార్స్ శుక్రవారం అట్లాంటాలో మొదటి ప్రదర్శన ఇచ్చారు. ఈ షోకి సంబంధించి ఒక వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. షోలో అక్షయ్ కుమార్ స్టేజీపై వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి.
ఇటీవలే రిలీజైన 'సెల్ఫీ' చిత్రంలోని మే ఖిలాడీ పాటకు అక్షయ్ కుమార్, నోరా ఫతేహి కలిసి చిందేశారు. అక్షయ్ తన నలుపు దుస్తులపై ఎరుపు రంగు లెహంగా ధరించి వచ్చారు. షర్ట్‌లెస్ లుక్‌లో తన అబ్స్‌ని ప్రదర్శించాడు. నోరా ఫతేహి పొట్టి ఎరుపు రంగు డ్రెస్సులో వేదికపైకి వచ్చింది. సాంగ్ ఊపందుకుంటున్న సమయంలో అక్షయ్ తన లెగంగా విప్పేసి మరీ డ్యాన్స్ వేశాడు. ఇద్దరూ కలిసి అదిరే స్టెప్పులు వేశారు. ఈ ఇద్దరి స్టెప్పులకు సంబందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అక్షయ్ కుమార్, నోరా ఫతేహి స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరి మాస్ పర్ఫామెన్స్‌కు అక్కడున్నవారు ఈలలు, కేకలతో అభినందనలు తెలియజేశారు. అక్షయ్ ఖిలాడీలా ఉన్నాడని, స్కర్ట్‌తో సూపర్ డాన్స్ చేశాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు నోరా ఫతేహి చాలా హాట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ భగవంతుని నామస్మరణతో ఈ టూర్‌ను ప్రారంభించగా.. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
యూఎస్‌లోని ప్రేక్షకుల కోసం ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడానికి అక్షయ్ కుమార్ ఈ టూర్ ప్లాన్ చేశాడు. అట్లాంటాలో మొదటి షో ముగియగా.. తర్వాతి షో డల్లాస్‌లో ఉంది. ఇక అక్షయ్ కుమార్ 'వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్' అనే సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ నిర్మిస్తోంది.
Also Read: Pathaan Collections: బాహుబలి-2 రికార్డు బద్దలు.. ఆల్ టైమ్ రికార్డు సినిమాగా 'పఠాన్'!
Also Read: TATA WPL 2023: డబ్ల్యూపీఎల్ 2023 ఆరంభం.. సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు! మ్యాచ్ రీ షెడ్యూల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.