TATA WPL 2023: నేడే డబ్ల్యూపీఎల్‌ 2023 ఆరంభం.. సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు! మ్యాచ్ రీ షెడ్యూల్

Kiara Advani to start WPL 2023 opening ceremony. డబ్ల్యూపీఎల్‌ 2023 ఆరంభ వేడుకలలో స్టార్ హీరోయిన్ కృతి సనన్, కొత్త పెళ్లి కూతురు కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

Written by - P Sampath Kumar | Last Updated : Mar 4, 2023, 04:46 PM IST
  • నేడే డబ్ల్యూపీఎల్‌ 2023 ఆరంభం
  • సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు
  • తొలి మ్యాచ్ రీ షెడ్యూల్
TATA WPL 2023: నేడే డబ్ల్యూపీఎల్‌ 2023 ఆరంభం.. సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు! మ్యాచ్ రీ షెడ్యూల్

Kriti Sanon, Kiara Advani to Give Dance Performance in TATA WPL 2023 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) అరంగేట్ర సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. 23 రోజుల పాటు టీ20 పండగ జరగనుంది. 5 జట్లు.. 87 మంది క్రికెటర్లు.. 22 మ్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేయనున్నాయి. శనివారం (మార్చి 4) గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్‌ ఆరంభమవుతుంది. డీవై పాటిల్‌ స్టేడియంలో రాత్రి 7.30 ఈ మ్యాచ్‌ ఆరంభం అవుతుంది. స్పోర్ట్స్‌18 నెట్‌వర్క్‌లో డబ్ల్యూపీఎల్‌ 2023 మ్యాచ్‌లు ప్రసారమవుతాయి. అలానే జియో సినిమా యాప్‌లోనూ చూడొచ్చు. 

తొలి డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. డబ్ల్యూపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లు సందడి చేయనున్నారు. స్టార్ హీరోయిన్ కృతి సనన్, కొత్త పెళ్లి కూతురు కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఇద్దరి అందాల భామల డ్యాన్స్‌తో పాటు పంజాబీ రాప్‌ సింగర్‌ ఏపీ దిల్లాన్ కూడా డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలలో సందడి చేయునున్నాడు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు కియారా, కృతి రిహార్స్‌ల్స్‌లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అందాల భామలు కృతి సనన్, కియారా అద్వానీల డాన్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తునారు. డబ్ల్యూపీఎల్ 2023 ఆరంభ వేడుకలు సాయంత్రం 5.30 ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరంభ వేడుకల కారణంగా గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుందని సమాచారం. టాస్ రాత్రి 7.30 గంటలకు, మ్యాచ్ 8 గంటలకు ఆరంభం కానుంది. 

5 జట్లతో సాగే తొలి సీజన్‌లో మొత్తం 18 రోజుల్లో 22 మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో లీగ్‌ దశలో ప్రతి జట్టూ మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. ప్రతి జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. రెండు, మూడు స్థానాల్లోని జట్లు.. తుది పోరులో చోటు కోసం ఎలిమినేటర్‌లో తలపడతాయి. 

Also Read: Indore Pitch Controversy: గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చారు.. ఐసీసీపై ఫైర్ అయిన భారత క్రికెట్ దిగ్గజం!

Also Read: ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌పై శ్రేయాస్ అయ్యర్ జోకులు.. అర్ధంకాక తల పట్టుకున్న ఆసీస్ క్రికెటర్! వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News