Pathaan-Baahubali Collections: బాహుబలి-2 రికార్డు బద్దలు.. ఆల్ టైమ్ రికార్డు సినిమాగా 'పఠాన్'!

Pathaan Movie Crossed The Lifetime Collections Of Baahubali 2 In Hindi. హిందీ వెర్ష‌న్‌లో టాప్ మూవీస్ లిస్టులో ప‌ఠాన్ మొద‌టి స్థానంలో నిలిచింది. 

Written by - P Sampath Kumar | Last Updated : Mar 4, 2023, 05:32 PM IST
  • బాహుబలి-2 రికార్డు బద్దలు
  • ఆల్ టైమ్ రికార్డు సినిమాగా 'పఠాన్'
  • ఏప్రిల్‌ చివరిలో స్ట్రీమింగ్‌
Pathaan-Baahubali Collections: బాహుబలి-2 రికార్డు బద్దలు.. ఆల్ టైమ్ రికార్డు సినిమాగా 'పఠాన్'!

Pathaan Movie Crossed The Lifetime Collections Of Baahubali 2 In Hindi: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘పఠాన్‌’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పఠాన్‌ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. దాంతో బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. 

ఇప్పటికే పఠాన్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా.. మరో సరికొత్త రికార్డును సృష్టించింది. హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే ఎస్ఎస్ రాజమౌళి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. హిందీలో రూ. 511.70 కోట్లు (నెట్‌) వసూలు చేసిన పఠాన్‌ సినిమా.. బాహుబలి-2 పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును (రూ. 510.99 కోట్లు)ను క్రాస్ చేసింది.

హిందీ వెర్ష‌న్‌లో టాప్ మూవీస్ లిస్టులో ప‌ఠాన్ మొద‌టి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బాహుబ‌లి 2 ఉండగా.. మూడో స్థానంలో కేజీయఫ్‌2 (రూ. 434.70 కోట్లు) ఉంది. దంగల్‌ (రూ. 374.43 కోట్లు), సంజూ (రూ. 342.53 కోట్లు) టాప్-5లో ఉన్నాయి. ఆరో వారానికి పఠాన్‌ సినిమా తమిళ్‌, తెలుగు భాషల్లో రూ.18.26కోట్లు వసూలు చేయగా.. హిందీతో కలిపి రూ. 529.96 కోట్లు(నెట్‌) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు వసూళ్ల రావడానికి ఇంకా అవకాశం ఉంది. ఎందుకంటే బాలీవుడ్ పరిశ్రమలో మరో పెద్ద సినిమా లేదు. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప‌ఠాన్ చిత్ర యూనిట్.. టికెట్‌ ధరల్లో రాయితీ, ఒకటి కొంటే మరొకటి ఉచితం లాంటి ఆఫర్లను ప్రకటిస్తోంది. 

పఠాన్‌ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌, షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్‌లు ఆనందం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పఠాన్‌ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా ఏప్రిల్‌ చివరిలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. 

Also Read: TATA WPL 2023: డబ్ల్యూపీఎల్‌ 2023 ఆరంభం.. సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు! మ్యాచ్ రీ షెడ్యూల్

Also Read: Indore Pitch Controversy: గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చారు.. ఐసీసీపై ఫైర్ అయిన భారత క్రికెట్ దిగ్గజం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x