OMG 2 Trailer Out: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్(Akshy Kumar) లేటెస్ట్ మూవీ ఓ మై గాడ్-2. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ఓ మై గాడ్(OMG) మూవీకి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. అప్పట్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు రెండు వందల కోట్ల కలెక్షన్స్ సాధించింది. తొలి భాగానికి ఉమేష్ శుక్ల దర్శకత్వం వహించాడు. ఇదే సినిమా తెలుగులో గోపాల గోపాలగా రీమేక్ అయింది. ఇందులో వవన్ కల్యాణ్, వెంకటేష్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం అక్షయ్ చేస్తున్న ఓ మై గాడ్-2 మూవీకి అమిత్‌ రాయ్‌ (Amit Roy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ట్రైలర్ ను(OMG 2 Trailer)  రిలీజ్ చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైల‌ర్ ఓపెన్ చేస్తే.. పార్ 1లో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్‌ కుమార్‌.. పార్ట్-2లో శివుడిగా కనిపించనున్నాడు. తొలి భాగంలో నాస్తికుడిగా పరేశ్‌ రావల్‌ కనిపిస్తే.. రెండో భాగంలో పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi) నటిస్తున్నాడు. పంకజ్ గొప్ప భక్తుడిగా కనిపిస్తున్నాడు. ఇందులో పంకజ్‌ త్రిపాఠి తన సమస్యలను పరిష్కరించమని దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో యామి గౌతమ్ లాయ‌ర్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. 



Also read: Ilaiyaraaja Biopic: త్వరలో సిల్వర్ స్క్రీన్ పైకి ఇళయరాజా బయోపిక్.. హీరో ఎవరంటే?


Also read: Guns & Gulaabs trailer: దుల్కర్ 'గన్స్‌ అండ్‌ గులాబ్స్‌' ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook