Alekhya Reddy Emotional Post on Balakrishna: నందమూరి బాలకృష్ణ తనకు కుమారుడు వరస అయ్యే నందమూరి తారకరత్న జ్ఞాపకార్థం ఒక సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేమిటంటే ఎవరైతే కార్డియో, తోరియాక్ ట్రీట్మెంట్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి పేదవారికి ఫ్రీగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కార్డియాక్ అరెస్ట్ లేదా తోరియాక్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్న వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్న హాస్పిటల్ తో పాటు హైదరాబాదులోని బసవతారకం హాస్పిటల్ లో కూడా ఈ మేరకు వైద్యం అందించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు తారకరత్న చివరి రోజుల్లో పడిన ఇబ్బందిని పక్కనే ఉండి గమనించిన బాలకృష్ణ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయం మీద స్పందించిన నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయ్యారు.



మీ గురించి ఏమని చెప్పను, మీకు ఎలా నా కృతజ్ఞతలు తెలియచెప్పను. నేను మీ గురించి ఎంత చెప్పినా మీ గురించి నాకు తెలిసిన దాంట్లో అది చాలా తక్కువే అవుతుంది. మిమ్మల్ని బంగారు మనసున్న వ్యక్తి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు ఆ పేరుతో పిలిపించుకోవడానికి అర్హులు, మీరు తప్ప బంగారు బాలయ్య అనిపించుకోవడానికి ఎవరూ అర్హులు కాదు మరోసారి చెబుతున్నాను ఎవరూ అర్హులు కాదు. మీరు నాకు ఒక తండ్రి కంటే ఎక్కువ ఒక స్నేహితుడు కంటే ఎక్కువలా కనిపించారు ఇప్పుడు మాత్రం నేను మీలో ఒక భగవంతుడిని చూస్తున్నాను, మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి మా నోట మాటలు రావడం లేదు.


నా గుండె లోతుల్లోంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మేము కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నాం, జై బాలయ్య అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేసుకుంది. ఇక నందమూరి తారకరత్న మరణించి ఒక నెల పూర్తవడంతో ఇటీవలే అలేఖ్య రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న అలేఖ్య రెడ్డికి నందమూరి అభిమానులు ధైర్యం చెబుతున్నారు. మీకేం కాదు నందమూరి కుటుంబం మీకు అండగా ఉంటుంది నందమూరి కుటుంబ సభ్యుల ఉండే మేము మీకు అండగా ఉంటాం అంటూ ఆమెకు ధైర్యం చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.


Also Read: Shilpa Shetty Akshay Kumar Break Up: శిల్పాశెట్టిని చీట్ చేసిన అక్షయ్ కుమార్‌..ప్రేమిస్తూనే అలా?


Also Read: Kajal Aggarwal in NBK 108: ఎన్బీకే 108లో కాజల్.. ఆ మాటే నిజమైందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook