Kajal Aggarwal in NBK 108: ఎన్బీకే 108లో కాజల్.. ఆ మాటే నిజమైందిగా!

Kajal Aggarwal Joins NBK 108 Shoot: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు, ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 20, 2023, 09:06 PM IST
Kajal Aggarwal in NBK 108: ఎన్బీకే 108లో కాజల్.. ఆ మాటే నిజమైందిగా!

Kajal Aggarwal Joins NBK 108 Shoot: వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కుమార్తె పాత్రలో నటిస్తోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లో శ్రీ లీల జాయిన్ అయినట్లుగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ మధ్యనే ఆమె సినిమా షూటింగ్లో జాయిన్ అయింది. బాలకృష్ణతో కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకుంటోంది.

ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఆ ప్రచారానికి కూడా బ్రేకులు వేస్తూ ఈరోజు కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తోందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ రోజు ఆసక్తికరంగా కాజల్ అగర్వాల్ ఈ సినిమా  షూటింగ్ లో పాల్గొన్న క్రమంలో అదే రోజున ఆమెకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తన సుదీర్ఘ కెరీర్ లో తెలుగులో అనేకమంది హీరోలతో నటించిన కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత నటిస్తున్న మొట్టమొదటి హీరో బాలకృష్ణ కావడం, ఇక నందమూరి బాలకృష్ణ కాజల్ అగర్వాల్ రెండు చేతులు పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ఫొటొలో నందమూరి బాలకృష్ణ చెయ్యి ఒక్కటే కనిపిస్తుండగా కాజల్ అగర్వాల్ ఆయన చేతిని పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.

ఇక మునుపెన్నడూ లేని కథతో నందమూరి బాలకృష్ణ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ అలాగే అనిల్ రావిపూడి కామెడీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందో అనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

ఇక సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో శ్రీ లీల ఒక బాక్సర్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె హైదరాబాదులో ప్రొఫెషనల్ బాక్సర్స్ దగ్గర శిక్షణ కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కథ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని అనిల్ రావిపూడి చెబుతున్నారు. చూడాలి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వచ్చి ఎలా అలరించబోతోంది అనేది.

Also Read: Vennira Aadai Nirmala: ఆ హీరో అర్ధరాత్రి తాగి వచ్చి డోర్ తీయ్యమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Also Read: Shanmukh Jaswanth Romance : కొత్త పిల్లతో షన్ముఖ్ జస్వంత్ రొమాన్స్.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయాడుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News