Ranbir and Alia Wedding Date: బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. కానీ, రణ్ బీర్ ఆలియాల పెళ్లి ఎప్పుడనేది మాత్రం ఎవ్వరికీ తెలియరావడం లేదు. వీరి పెళ్లి మాత్రం ఇప్పుడు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నట్లు బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఏప్రిల్ లేదా ఈ ఏడాది నవంబరులో రణ్ బీర్, ఆలియా పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంతో కాలంగా డేటింగ్ లో ఉన్న రణ్ బీర్ కపూర్ - ఆలియా భట్ ఇప్పుడు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలుస్తోంది. అయితే వీరిద్దరి వివాహం 2020లోనే జరగాల్సి ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కరోనా సంక్షోభం, వరుస సినిమాల షూటింగ్స్ వల్ల తమ పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ మాదిరిగా ఆలియా, రణ్ బీర్ రహస్య వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారట. 


పెళ్లి కోసం ఇరు కుటుంబాలు ఇప్పటికే షాపింగ్ స్టార్ట్ చేశారని తెలుస్తోంది. అయితే ఆలియా, రణ్ బీర్ పెళ్లి వేడుకకు ఫ్యామిలీ సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ముంబయిలోని ఆర్కే హౌస్ లో పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. రణ్ బీర్ తల్లిదండ్రులు రిషీ కపూర్, నీతూ కపూర్ ల పెళ్లి కూడా అక్కడే జరిగిందట. ఇక రణ్ బీర్ - ఆలియాల పెళ్లి కూడా అక్కడే జరిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


Also Read: Ricky Kej Grammy: గ్రామీ అవార్డు దక్కించుకున్న భారతీయ మ్యుజీషియన్.. ప్రధాని మోదీ అభినందనలు!


Also Read: Rajamouli Dance: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో నాటు నాటు సాంగ్ కు రాజమౌళి స్టెప్పులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook