Rajamouli Dance: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో నాటు నాటు సాంగ్ కు రాజమౌళి స్టెప్పులు!

Rajamouli Dance: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. సోమవారం నుంచి లాభాల బాట పట్టింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ సోమవారం రాత్రి సక్సెస్ మీట్ ను అరేంజ్ చేసింది. ఈ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి నాటు నాటు స్టెప్పుకు డ్యాన్స్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 10:19 AM IST
Rajamouli Dance: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో నాటు నాటు సాంగ్ కు రాజమౌళి స్టెప్పులు!

Rajamouli Dance: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. రామ్ చరణ, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు లాభాల బాట పట్టింది. 

ఈ సందర్భంగా చిత్ర నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆర్ఆర్ఆర్ టీమ్ కు సక్సెస్ పార్టీ ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ సక్సెస్ పార్టీకి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు కొరటాల శివ, అనిల్ రావిపూడితో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు దర్శకనిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు. 

అయితే 'ఆర్ఆర్ఆర్' మూవీ సక్సెస్ పార్టీలో నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేస్తానని నటుడు ఎన్టీఆర్ కు రాజమౌళి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం జరిగిన సక్సెస్ పార్టీలో నాటు నాటు సిగ్నెచర్ స్టెప్పును డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు కలిసి స్టెప్పులేశారు. రాజమౌళి డ్యాన్స్ కు కార్యక్రమంలో ఉన్న వారంతా ఆనందంతో చప్పట్లు కొట్టి అభినందించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  

Also Read: Ricky Kej Grammy: గ్రామీ అవార్డు దక్కించుకున్న భారతీయ మ్యుజీషియన్.. ప్రధాని మోదీ అభినందనలు!

Also Read: Ram Charan Gold Coin: 'బంగారు' మనసు చాటుకున్న మెగాపవర్ స్టార్.. RRR యూనిట్ కు స్పెషల్ గిఫ్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News