Alia Bhatt and Allu Arjun: రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నటించడంతో బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఆర్ఆర్ఆర్‌‌ మూవీ పాన్‌ ఇండియా సినిమాగా మార్చి 25వ తేదీన రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటించింది ఆలియా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన మనస్సులోని మాటలను బయటపెట్టంది. తనకు తెలుగులో చాలా సినిమాల్లో నటించాలని ఉందంటూ ఆలియా భట్‌ చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను ఎవరి సరసన నటించాలనుకుంటుందో కూడా చెప్పేసింది. 


తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇటీవ రిలీజైన అల్లు అర్జున్‌ పుష్ప మూవీని చూశారని.. ఇక అప్పటి నుంచి తన కుటుంబ సభ్యులంతా కూడా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ అయిపోయారని ఆలియా భట్‌ చెప్పింది. మరి నువ్వు ఎప్పుడు అల్లు అర్జున్‌తో నటిస్తావని తన కుటుంబ సభ్యులు తనని అడిగారని చెప్పుకొచ్చింది ఈ భామ. 


అయితే అల్లు అర్జున్‌తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం తాను ఎగిరి గంతులేస్తానంటూ ఆలియా భట్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అల్లు అర్జున్‌తో కలిసి నటించాలని తాను ఎంతోగానూ ఎదురు చూస్తున్నానంటూ ఆలియా భట్‌ తన మనస్సులోని మాటను చెప్పింది.


ఇక సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన గంగూబాయి కతియావాడీ మూవీలో ఆలియా భట్‌ నటించింది. ఈ మూవీ ఈ నెల 25న థియేటర్స్‌లలో డైరెక్ట్‌గా రిలీజ్‌ కానుంది. అలాగే రణ్‌బీర్‌ కపూర్‌‌తో బ్రహ్మాస్త్ర మూవీలో, రణ్‌వీర్‌ సింగ్‌తో రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ సినిమాలో ఆలియా భట్‌ నటిస్తోంది. మరి ఆలియా భట్‌ (Alia Bhatt) చెప్పిన విషయంపై అల్లు అర్జున్ (Allu Arjun) ఏవిధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.


Also Read: Romeo Juliet Full Song: వాలెంటైన్స్ కోసం మరో కొత్త పాట.. రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్


Also Read: Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే.. ప్రేక్షకులకు పండగే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook