Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే.. ప్రేక్షకులకు పండగే!

Upcoming Movies: ఈ వారం కూడా పలు సినిమాలు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలు ఏంటో చూసేద్దామా!  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 04:33 PM IST
Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే.. ప్రేక్షకులకు పండగే!

Upcoming Movies this Week: కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రాలు మళ్లీ థియేటర్‌ల వైపు క్యూ కడుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు (movie release this week) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు ఓటీటీలోనూ ఇంకొన్ని సినిమాలు సందడి చేయటానికి రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దామా!

థియేటర్లలో రిలీజ్ అయ్యే చిత్రాలు: 

ఖిలాడి (Khiladi): మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖిలాడి'. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటించారు. అర్జున్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. రమేష్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. 

ఎఫ్‌ఐఆర్‌ (FIR): విష్ణు విశాల్‌ హీరోగా మంజిమామోహన్‌, రెబా మోనికాజాన్‌ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘'ఎఫ్‌.ఐ.ఆర్‌'. మను ఆనంద్‌ దర్శకుడు. హీరో రవితేజ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 11న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

సెహరి (Sehari): హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా సెహరి. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకుడు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డీజే టిల్లు (DJ Tillu):  సిద్ధు జొన్నలగడ్డ హీరోగా  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'డిజె టిల్లు'.  నేహాశెట్టి కథానాయిక. విమల్‌కృష్ణ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Also Read: Lip Lock Scenes: యంగ్ హీరోయిన్స్‌తో లిప్‌ లాక్‌లతో సీనియర్ హీరోలు.. మొన్న నాని.. ఈ రోజు రవితేజ!

ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు: 

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime):
**మహాన్‌ (Mahaan)
**గెహ్రాహియా (Gehraiyaan)
** ఐ వాంట్‌ యూ బ్యాక్‌ (I Want you back)

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix):
** క్యాచింగ్‌ కిల్లర్స్‌ (వెబ్‌ సిరీస్‌ సీజన్‌-2) -ఫిబ్రవరి 9
** ఇన్వెంటింగ్‌ అన్నా (వెబ్‌ సిరీస్‌)- ఫిబ్రవరి11
** లవ్‌ అండ్‌ లీషెస్‌ (కొరియన్‌) -ఫిబ్రవరి 11
** టాల్‌ గర్ల్‌ (హాలీవుడ్‌) -ఫిబ్రవరి11
** ద ప్రివిలేజి (హాలీవుడ్)-ఫిబ్రవరి11

ఆహా (AHA)-భామా కలాపం’ (BhamaKalapaam)
జీ 5 (ZEE 5)- మళ్లీ మొదలైంది (Malli Modalaindi)
డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ (Disney hotstar): 
** హీరో (Hero)- ఫిబ్రవరి 11
** స్నో డ్రాప్‌ (కొరియన్‌ సిరీస్‌)- ఫిబ్రవరి 9

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News