Ranbir Kapoor Throws Fan Phone ఒక్కోసారి సెలెబ్రిటీలకు చిరాకు వస్తుంటుంది. గుంపులుగా జనాలు రావడంతో వారికి అలా అనిపిస్తుందా? లేదంటే అభిమానులు పదే పదే సెల్ఫీలు అడిగితే అలా చిరాకు పడతారా? అన్నది తెలియదు. ఇక మన నందమూరి బాలయ్యకు అయితే ముక్కు మీదే కోపం ఉంటుంది. బాలయ్య తన అభిమానులను కొట్టినన్ని దెబ్బలు ఇంకేతర హీరో కూడా కొట్టి ఉండడు. బాలయ్యకు చిరాకు వస్తే చాలు చుట్టు పక్కల ఎవరున్నా దబిడి దిబిడి అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ మధ్య ఒకసారి హీరో సూర్య తండ్రి సైతం ఇలానే చేశాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ బీర్ కపూర్, అలియా భట్ భర్త విచిత్ర ప్రవర్తన గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఓ అభిమాని సెల్ఫీ కోసం సతాయించినట్టుగా ఉన్నాడు. సెల్ఫీ ఇచ్చినట్టుగానే ఇచ్చి ఆ ఫోన్‌ను తీసుకుని అవతలకు విసిరేశాడు.


 




దీంతో సదరు అభిమాని ఖంగుతిన్నాడు. చుట్టు పక్కల ఉన్న వారు కూడా షాక్ అయ్యారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అనే వివరాలు తెలియడం లేదు. ఇది ప్రాంక్ వీడియోనా? నిజంగానే జరిగిందా? అనే అనుమానాలు కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.


మన బాలయ్యలా మారిన రణ్‌ బీర్ కపూర్ అంటూ కొంత మంది నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మొత్తానికి రణ్‌ బీర్ కపూర్, అలియా భట్‌కు గత ఏడాది మాత్రం ఎంతో మెమరబుల్. పెళ్లి జరగడం, పండంటి బిడ్డ పుట్టడం, ఇద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా హిట్ అవ్వడం ఇలా అన్నీ బాగానే కలిసి వచ్చాయి.


Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook