Alia Bhatt Blessed with Baby Girl : బాలీవుడ్ క్రేజీ జంట అలియా భట్ రణ్‌బీర్ కపూర్‌లు తల్లిదండ్రులయ్యారు. కాసేపటి క్రితమే అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని రిలయెన్స్ హాస్పిటల్లో అలియా భట్‌కు డెలివరీ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి అలియా భట్‌ తల్లి అవ్వడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అలియా భట్ రణ్‌ బీర్ కపూర్ పెళ్లి ఏప్రిల్ 14న అయింది. ఆ లెక్కన ఇంకా తొమ్మిది నెలలు అవ్వలేదు కదా? అని కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి ముందే అలియా భట్ గర్భవతి అయిందన్న వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలోనే అలియా భట్ పెళ్లి జరిగిందని టాక్ కూడా వచ్చింది. పెళ్లైన రెండు నెలలోపే గర్భంతో కనిపించడంతో ఆ రూమర్లన్నీ నిజమేనని అందరికీ అర్థమైంది.


బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో అలియా భట్ గర్భంతోనే కనిపించింది. ప్రెగ్నెంట్ అయినా తన సినిమా కోసం బాగానే కష్టపడింది. వెంటే ఉండి రణ్ బీర్ కపూర్ కూడా అలియా భట్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. అయితే ఇప్పుడు అలియా భట్ మాత్రం పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో రణ్‌ బీర్ కపూర్ మాత్రం గాల్లో తేలిపోతోన్నట్టుగా తెలుస్తోంది.


నయన్ సరోగసి వ్యవహారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సమయంలో అందరూ కూడా అలియా భట్‌ను మెచ్చుకున్నారు. నయన్‌లా అద్దె గర్భం కాకుండా.. అలియా భట్ సహజ గర్భాన్ని ఆశ్రయించిందని, ఇలా సహజంగా తల్లి అవ్వబోతోందంటూ అందరూ మెచ్చుకున్నారు. అలియా భట్ కూడా ఆ మాతృత్వ దశను బాగానే ఆస్వాధించినట్టు కనిపించింది. సీమంతం ఫోటోల్లో అలియా భట్ నవ్వుతూ ఎంతగానో మెరిసిపోయింది. ఇక అలియా భట్ తన బంగారు పాపను అభిమానులకు ఎప్పుడు చూపిస్తుందో చూడాలి.


Also Read : Janhvi Kapoor Mili Collection : జాన్వీ కపూర్‌కు ఘోర పరాభవం.. మరీ అంత తక్కువ కలెక్షనా?


Also Read : Singer Uma Neha Photoshoot : మరీ అంత పొట్టి బట్టలా?.. రెచ్చిపోతోన్న తెలుగు సింగర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook