Janhvi Kapoor Mili Collection : జాన్వీ కపూర్‌కు ఘోర పరాభవం.. మరీ అంత తక్కువ కలెక్షనా?

Janhvi Kapoor Mili జాన్వీ కపూర్ నటించిన మిలీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా ఏళ్ల తరువాత జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చింది. ధడక్ తరువాత ఆమె నటించిన చిత్రాలు ఓటీటీలోనే వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 12:04 PM IST
  • కొత్త సినిమాతో జాన్వీ కపూర్ సందడి
  • మిలి సినిమాతో జాన్వీ దశ తిరిగేనా?
  • బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ మిలి
Janhvi Kapoor Mili Collection : జాన్వీ కపూర్‌కు ఘోర పరాభవం.. మరీ అంత తక్కువ కలెక్షనా?

Janhvi Kapoor Mili Collection : జాన్వీ కపూర్ సినిమాలకు అసలు గిరాకియే ఉండటం లేదు. జాన్వీ కపూర్ అందాలు ఆడియెన్స్‌ను థియేటర్ వరకు రప్పించడం లేదు. అసలు జాన్వీ కపూర్ సినిమాలు అంటే జనాలు చూసే పరిస్థితే ఉండటం లేదు. ధడక్ అంతో ఇంతో పర్వాలేదనిపించింది. జాన్వీ కపూర్ ఎంట్రీ కాబట్టి జనాలు చూశారు. కానీ జాన్వీ కపూర్‌కు మాత్రం ఇంత వరకు సరైన హిట్టే రాలేదు. మధ్యలో కరోనా దాపరించడం, దాంతో ఆమె చేసిన సినిమాలు వరుసగా ఓటీటీలోనే వచ్చాయి.

అలా జాన్వీ కపూర్ గుంజన్ సక్సెనా, రూహీ, గుడ్ లక్ జెర్రీ ఇలా అన్నీ కూడా బోల్తా కొట్టేశాయి. అసలు జాన్వీ కపూర్ నటన పరంగా, లుక్స్ పరంగా జనాలను అట్రాక్ట్ చేయడం లేదు. జాన్వీ కపూర్ ఇప్పుడు మిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను జాన్వీ కపూర్ తెలుగులో కూడా బాగానే ప్రమోట్ చేసింది. కానీ ఇక్కడి జనాలు ఆమెను అంతగా పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు.

ఇక హిందీలోనూ ఆమె పరిస్థితి అంతే ఉన్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం నాటి బాక్సాఫీస్ డీటైల్స్ చూస్తే జాన్వీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. జాన్వీ కపూర్ సినిమాకు మొదటి రోజు దగ్గరదగ్గరా నలభై లక్షలు మాత్రమే వచ్చాయట. ఇక కత్రినా నటించిన ఫోన్ బూత్ సినిమాకు రెండు కోట్లకు పైగా వచ్చాయని తెలుస్తోంది. రామ్ సేతు సినిమాకు కోటిన్నర రాగా.. కాంతారా సినిమా ఇంకా దూసుకుపోతోంది. కాంతారా హిందీ వర్షెన్ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోండటం విశేషం.

ఇప్పుడు జాన్వీ కపూర్ సినిమా కలెక్షన్లు మరింతగా దారుణంగా పడిపోయేట్టు కనిపిస్తోంది. మిలీ సినిమా ఇప్పుడు అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచేట్టుగా కనిపిస్తోంది. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేట్టు కనిపిస్తోంది. మరి జాన్వీ కపూర్‌కు అసలు సిసలైన కమర్షియల్ హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తేనే ఆ హిట్ వచ్చేలా కనిపిస్తోంది.

Also Read : Mahesh Babu Remuneration : నిజం సినిమాకు మహేష్‌ ఎంత తీసుకున్నాడంటే.. రెమ్యూనరేషన్, బడ్జెట్‌, లాభాలపై తేజ కామెంట్స్

Also Read : Bigg Boss inaya : ఆ ఆడియెన్స్ ఏంటో.. ఆ బిగ్ బాస్ టీం ఏంటో?.. హోస్ట్‌కు దండం పెట్టాల్సిందే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News