Alia Bhatt Reacts to Trolls on Pregnancy: బాలీవుడ్ భామ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైంది. తన తండ్రి మహేష్ బట్ నట వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత తనకంటూ సపరేట్ క్రేజ్ దక్కించుకుంది. అంతేకాక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న ఆమె తెలుగు ప్రేక్షకు కూడా దగ్గరయింది. అయితే తాజాగా ఆమె తన గర్భం మీద వచ్చిన విమర్శలపై స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి అలియాబట్ వివాహం చేసుకున్న రెండు నెలలకే తాను గర్భవతిని అయ్యానంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆమె గర్భం మీద కూడా చాలా మంది భిన్నంగా స్పందించారు. కొంతమంది ఆమెకు శుభాకాంక్షలు చెబితే మరి కొంత మంది మాత్రం కాస్త ఇబ్బందికరమైన కామెంట్లు చేశారు. చిన్న వయసులో తల్లి కావడం ఏమిటని కొందరు కామెంట్ చేస్తే పెళ్ళైన వెంటనే తల్లి కావడం ఏమిటంటూ కొందరు ప్రశ్నించారు. అయితే తాజాగా ఈ విషయం మీద స్పందించిన అలియా భట్ ఆ విమర్శలపై ఘాటుగా స్పందించారు. 


మాములుగా ఒక అమ్మాయి ఏం చేసినా అందరికీ ఏదో పెద్ద వార్త అనిపిస్తుంది, అమ్మాయి ఎవరినైనా ప్రేమించినా, డేటింగ్ లో ఉందని తెలిసినా, తల్లి కాబోతుందని తెలిసినా అన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతారని ఆమె విమర్శించారు. అంత ఎందుకు క్రికెట్ చూడటానికి వెళ్లినా, ఏదైనా హాలిడే ట్రిప్ కి వెళ్ళినా సరే ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తారని అలియా భట్ కామెంట్ చేశారు. ఇక తనది యుక్త వయసే అయితే ఇప్పుడు పిల్లలని కంటే వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని ఆమె ప్రశ్నించారు. నేను చిన్నదాన్నే అయితే ఏంటి? ఒక ఫ్యామిలీ, లేదా పిల్లలను కలిగి ఉండటం నా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? అవి రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలని ఆమె పేర్కొన్నారు.


 అంతేకాక  కొన్ని గొప్ప విషయాలు మనం ప్లాన్ చేసుకోనవసరం లేదని వాటంతట అవే జరిగిపోతాయంటూ తన గర్భధారణ గురించి ఆమె ప్రస్తావించారు. ఈ విషయాల గురించి ఆలోచించేంత సమయం తనకు లేదని తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానని అలియా పేర్కొన్నారు. మొత్తం మీద తన గర్భధారణ పై చేసిన కామెంట్లు విషయంలో అలియాబట్ ఘాటుగా వ్యాఖ్యానించారు అని చెప్పాలి.


Also Read: Raviteja: మెగా 154లో రవితేజ షాకింగ్ రోల్.. లీకయిన ఇన్ సైడ్ ఇన్ఫో!


Also Read: Saami Saami song:సామీ సామీ అంటూ అదరకొట్టిన బామ్మ.. రష్మికకు గట్టి పోటీ ఇచ్చిందిగా!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook