Alia Bhatt Revels why she deleted a number of RRR movie promotional posts: పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌పై బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ అసంతృప్తిగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియాకు స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ ఇచ్చారని, అందుకే సినిమా ప్రమోషన్స్‌కి కూడా దూరంగా ఉన్నాయని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అసహనంలో గతంలో షేర్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి డిలీట్‌ చేశారని  కొంతమంది ట్వీట్లు చేశారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిని అన్‌ఫాలో చేసిందని ప్రచారం కూడా చేశారు. తాజాగా ఈ రూమర్లపై ఆలియా స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌పై ఎలాంటి అసంతృప్తి, అసహనం లేదని.. దయచేసి ఇలాంటి రూమర్లను ప్రచారం చేయకండంటూ అలియాభట్‌ ప్రతిఒక్కరిని విజ్ఞప్తి చేశారు. 'ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇలాంటి అసత్య ప్రచారాల్ని దయచేసి సృష్టించవద్దు అని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తక్కువ పోస్ట్‌లు ఉండాలనే ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు పాత పోస్టులను, వీడియోలను తొలగిస్తుంటా. అందులో భాగంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను తొలగించా. అంత మాత్రాన ఏదేదో ఊహించుకుంటే ఎలా?. అదంతా యాదృచ్ఛితంగా జరిగిన సంఘటన' అని ఇన్‌స్టా స్టోరీలో ఆలియా ఓ లేఖను పోస్ట్‌ చేశారు. 


'ఆర్‌ఆర్‌ఆర్‌ అనే ప్రపంచంలో నేను భాగస్వామిని అవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో నేను పోషించిన సీత పాత్రను ఎంతగానో ఇష్టపడ్డాను. రాజమౌళి సర్‌, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి పనిచేయడాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మంచి మధురానుభూతిని ఇచ్చింది. రాజమౌళి, టీమ్‌ ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలమే ఈ సినిమా' అని అలియా భట్‌ ట్వీట్ చేశారు.


దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ గత శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో.. భారత దేశంతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొదటి రోజే రూ.223 కోట్లు రాబట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇప్పటివరకు దాదాపుగా రూ. 700 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. కలెక్షన్లు ఇలాగే ఉంటే బాహుబలి రికార్డ్స్ బద్దలవుతాయని టాక్. 


Also Read: Hyderabad Metro Offer: ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం! కండిషన్ అప్లై!


Also Read: RRR Movie: ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్ షో.. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook