Alia Bhatt Special Bags To Jr NTR Kids: ఎన్టీఆర్ పిల్లల కోసం అలియా భట్ స్పెషల్‌గా గిఫ్టులను పంపించింది. చూస్తుంటే తన బ్రాండ్‌ను తానే ఇలా ప్రమోట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా అలియా భట్ ఎడ్ మామా అనే బ్రాండ్‌తో టై అప్ అయినట్టుగా ఉంది. అందుకే ఇలా ఎన్టీఆర్ పిల్లలకు స్పెషల్‌గా ఆ బ్యాగులను పంపించింది. ఇక అభయ్, భార్గవ్‌లకు రెండు బ్యాగులను పంపించిన అలియాను.. మరి నాకు ఏది? అన్నట్టుగా ఎన్టీఆర్ అడిగాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నువ్ ఎప్పుడూ కూడా నా పిల్లల మొహం మీద నవ్వు చూడాలని అనుకుంటావ్.. థాంక్యూ అలియా భట్.. మరి నా పేరు మీద కూడా ఓ బ్యాగ్ త్వరలోనే నా ఇంటికి వస్తుందని ఆశిస్తున్నాను అని ఎన్టీఆర్ అడిగేశాడు. దానికి అలియా భట్ ఇలా రిప్లై ఇచ్చింది. యా.. హహహ పంపిస్తాను.. నువ్ అడిగితే.. ఎడ్ వియర్‌ మొత్తాన్ని పంపిస్తాను.. నువ్ ఎంతో స్వీట్ అంటూ అలియా భట్ అనేసింది.


అలియ భట్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఎంత అల్లరి చేశారో అందరికీ తెలిసిందే. అలియా భట్ ఎక్కువగా ఎన్టీఆర్‌తో క్లోజ్ అయినట్టుగా ప్రమోషన్స్‌లో కనిపించేది. రామ్ చరణ్‌ సెట్‌లో సైలెంట్‌గా ఉండేవాడని అందరూ చెబుతూనే ఉంటారు. ఇక ఎన్టీఆర్ అయితే సెట్ అంతా సందడి వాతావరణాన్ని నింపుతుంటాడు. అందుకే ఎన్టీఆర్ అలియాలు క్లోజ్ అయినట్టుగా ఉంది.


[[{"fid":"267195","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ పాత్ర అంత పెద్ద ప్రభావం ఏమీ చూపించలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు మాత్రమే పేరు వచ్చింది. ఇక గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డు రావడంతో నాటు నాటు పాట వల్ల కీరవాణి, చంద్రబోస్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడాది అయిన సందర్భంగా సోషల్ మీడియాలో నాటి రోజును అంతా గుర్తు చేసుకున్నారు. అటు నందమూరి ఇటు మెగా ఫ్యాన్స్ హంగామా చేశారు.


Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్


Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook