Alia Bhatt Yoga Workouts అలియా భట్ రణ్ బీర్ కపూర్ పెళ్లి వేడుకల గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి అయిన తేదీకి, తల్లి అయిన తేదీలకు ఐదారు నెలలు కూడా గ్యాప్ లేదు. దీంతో పెళ్లికి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్ అయిందన్న సంగతి అందరికీ కన్ఫామ్ అయింది. అయితే అలియా భట్ ఇప్పుడు మళ్లీ తన సినిమాల మీద ఫోకస్ పెట్టేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. తన కూతురు రాహకు కావాల్సిన టైంఇస్తూనే మళ్లీ తన ఫిట్ నెస్‌ను తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు నెలన్నర తరువాత మళ్లీ ఇలా వర్కౌట్లు చేస్తున్నాను.. మెల్లిమెల్లిగా మళ్లీ నాతో నేను, నాలోని నన్ను చూసుకునేందుకు ఇలా యోగాను ప్రారంభించాను..నా గురువు అన్షుక యోగాతో కలిసి వర్కౌట్లు మొదలుపెట్టేశాను. డెలివరీ తరువాత అందరూ కూడా వారి వారి శరీరాల గురించి ఆలోచించుకోండని నా తోటి అమ్మలకు చెబుతున్నా.. మీ వల్ల అయ్యే వర్కౌట్లు మాత్రమే చేయండి.. నేను కూడా మొదటి రెండు వారాలు ఎక్కువగా వర్కౌట్లు చేయలేదు..


 



బ్రీతింగ్, వాకింగ్‌ అంటూ ఇలా మెల్లిగా స్టార్ట్ చేశాను.. ఇప్పుడు ఇలా నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.. మీకు కావాల్సినంత సమయాన్ని తీసుకోండి.. మీ శరీరాన్ని మీరు మెచ్చుకోండి.. ఈ ఏడాది నా శరీరాన్ని నేను ఇది వరకు ఎప్పుడూ కష్టపెట్టనంతా కష్టపెట్టాను.. బిడ్డకు జన్మను ఇవ్వడం ఓ అద్భుతమైన ఫీలింగ్.. మన శరీరాన్ని మనం ప్రేమించడమే దానికీ మనం చేయగలిగింది..


ఒక్కొక్కరి శరీర తత్త్వం ఒక్కోలా ఉంటుంది.. మీరు మీ మీ వైద్యుల సలహాలు తీసుకోండి.. ఎవరెవరికి ఏఏ వర్కౌట్లు బాగుంటాయో తెలుసుకోండి.. వైద్యుల సలహాల మేరకు మాత్రమే వర్కౌట్లు చేయండి అని అలియా భట్ చెప్పుకొచ్చింది.


Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్


Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook