Police Case Filed Against Poonam Pandey: ఫెమస్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణంపై వచ్చిన వార్తలు అందరిని తీవ్రంగా కలచవేసింది. బాలీవుడ్ తో పాటు, ఆమె అభిమానులు, స్నేహితులు, కొందరు కుటుంబ సభ్యులు ఇది నిజమే అని నమ్మారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది ఆమె సర్వైకల్ క్యాన్సర్ చనిపోయిందని అఫిషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిన్నటి నుంచి టీవీలు, యూట్యూబ్ లు, సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ మారిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతి చిన్న వయసులో ఆమె ఇలా క్యాన్సర్ తో చనిపోయిందన్న వార్త విని చాలా మంది షాకింగ్ కు గురయ్యారు. అదే విధంగా  ఆమె బాడీకన్పించకపోవడం, అంతిమ సంస్కారాలపై ఎలాంటి సమాచారంలేకపోవడంతో ఇది మరో ట్విస్ట్ గా మారిందని అందరు భావించారు. అదే విధంగా పూనమ్ పాండే కుటుంబ సభ్యులు కూడా దీనిపై స్పందించకపోవడంతో అనేక అనుమానాలకు దారితీశాయి.


ఈ క్రమంలోనే అందిరిని షాకింగ్ కు గురిచేస్తూ.. నటి పూనమ్ పాండే ఇన్ స్టాలో వీడియో చేసి అందరిని నోరెళ్లబెట్టేలా చేశారు. ఆ వీడియోలో పూనమ్ పాండే మాట్లాడుతూ.. తాను బతికే ఉన్నానని తెలిపారు. అంతేకాకుండా... తనకు గర్బాశయ క్యాన్సర్ రాలేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎందరో మహిళలు గర్బాశయ క్యాన్సర్ తో  పీడించబడుతున్నారని, దీనిపై చాలా మంది సరిగ్గా అవగాహన కల్గిలేరని ఆమె అన్నారు. ఈ క్రమంలోనే ఆమె తనకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చి, చనిపోయినట్లు ఇలా వార్త ప్రచారం అయ్యేలా చేశానని పూనమ్ పాండే చెప్పింది.


ఇదిలా ఉండగా దీనిపై ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు కొందరు మద్దతుగా పలకుతుండగా, మరికొదరు మాత్రం పూనమ్ పాండే ప్రవర్తనను ఏకీపారేస్తున్నారు. అవగాహన కోసం నీకు మరో మార్గం దొరకలేదా.. అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఒక అడుగు ముందుకేసి ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. కేవలం గర్బాశయ క్యాన్సర్ అవగాహన కోసం ఇలా చేశారు.


అయితే.. ఇప్పటికే పూనమ్ పాండే చనిపోయిందని ఎందరో ఆమె ఫ్యాన్స్ ఎమోషనల్ అయి కన్నీళ్లతో నివాళులు అర్పించారు. ఇదాంతా ఫెక్ అని తెలియడంతో వారంతా ఎంతో హర్ట్ అయ్యారని కూడా సినీ వర్కర్స్ అసోసియేషన్  ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


Read Also: Poonam Pandey: అందరి చెవిలో పువ్వు పెట్టిన పూనమ్ పాండే.. ఆ అవగాహన కోసమే ఇలా చేశా..


Read Also: Poonam Pandey Last Video: పూనం పాండే లాస్ట్‌ వీడియో ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook