Poonam Pandey: అందరి చెవిలో పువ్వు పెట్టిన పూనమ్ పాండే.. ఆ అవగాహన కోసమే ఇలా చేశా..

Poonam Pandey Alive: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త అందరిని కలవరపరుస్తుండగా.. ఇప్పుడు ఆమె ఇంస్టాగ్రామ్ వీడియోలో ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపరిచింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 01:13 PM IST
Poonam Pandey: అందరి చెవిలో పువ్వు పెట్టిన పూనమ్ పాండే.. ఆ అవగాహన కోసమే ఇలా చేశా..

 Poonam Pandey Instagram Reel: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే నిన్న మరణించింది అనే వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. అందులోనూ సర్వైకల్ క్యాన్సర్‌తో ఈ హీరోయిన్ చనిపోయారని మేనేజర్ ప్రకటించడం ఆమె అభిమానులు అందరిని మరింత కలచివేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈరోజు ఉదయం నుంచి చనిపోయిన తరువాత ఆమె బాడీ కనిపించకపోవడం.. ఆమె ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వకపోవడం దానిపైన కూడా ఎన్నో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అసలు తాను చచ్చిపోనేలేదు అంటూ ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసి అందరిని షాక్ గురి చేసింది పూనమ్ పాండే.

వివాదాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండే హీరోయిన్ పూనమ్. ఏదో ఒక వివాద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అందుకే ఈ హీరోయిన్ చనిపోయింది అన్నా కాని.. నిన్న మొదట్లో అందరూ అది పబ్లిక్ స్టాంట్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె మేనేజర్ కూడా ధ్రువీకరించడంతో అందరూ ఇది నిజమని నమ్మి చాలా బాధపడ్డారు. ముఖ్యంగా చనిపోయారు అనే వార్త మీద ఎవ్వరు పబ్లిసిటీ చేసుకోరు అని అందరూ భావించి ఆమె మరణ వార్తను నమ్మారు. అయితే చావు విషయంలో కూడా నిజంగానే పబ్లిసిటీ క్రియేట్ చేసింది ఈ హీరోయిన్.

అందరూ ఆమె మరణ వార్త విని బాధపడుతూ ఉన్న సమయంలో ఆమె ఏకంగా ఇంస్టాగ్రామ్ ముందుకు వచ్చి..“మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను - నేను ఇక్కడే ఉన్నాను, సజీవంగా ఉన్నాను.   గర్భాశయ క్యాన్సర్ నన్ను తీసుకుపోలేదు, కానీ విషాదకరంగా, ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళల ప్రాణాలను కోల్పోతున్నారు.  కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది.  HPV వ్యాక్సిన్.. ముందస్తుగా గుర్తించే పరీక్షలు కీలకమైనవి.  ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు మన వద్ద ఉన్నాయి.  క్లిష్టమైన అవగాహనతో మనం ఈ క్యాన్సర్ ని ఎదుర్కోవాలి. ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల అందరికీ తెలియ చేద్దాం.  ఏమి చేయవచ్చో.. పరిశోధించడానికి  నా బయోలోని లింక్‌ని సందర్శించండి.  మనందరం కలిసి #DeathToCervicalCancer కి ఎండ్ కార్డ్ తీసుకురావడానికి కృషి చేద్దాం” అంటూ చెప్పుకొచ్చింది.

 

 
 
 
 
 

 

 

 

అంతేకాకుండా మరో వీడియోలో తను ఎవరినన్నా బాధపెట్టి ఉంటే క్షమించమని తన ఉద్దేశం మొత్తం సర్వికల్ క్యాన్సర్ గురించి అమ్మాయిలకు తెలియజేయడమే అని చెప్పుకొచ్చింది.

ఈమె వీడియో చూసి కొంతమంది పోనీలే బతికే ఉంది అని సంతోషపడుతుండగా మరికొందరు మాత్రం చావుని కూడా ఇలా పబ్లిసిటీకి వాడుకుంటారా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Bharata Ratna to LK Adwani: L.k అద్వానీకి భారతరత్న.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..

Also Read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News