Aa Okkati Adakku OTT: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ సినిమా.. ఆ ఒక్కటి అడక్కు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Aa Okkati Adakku: అందరినీ ఆశ్చర్యపరుస్తూ అల్లరి నరేష్ సినిమా ఆ ఒక్కటి అడక్కు.. ఎవరికి చెప్పకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్.. గురించి పూర్తి వివరాలు మీకోసం..
Aa Okkati Adakku OTT Platform: అల్లరి నరేష్ హీరోగా ఈమధ్య వచ్చిన కామెడీ చిత్రం ఆ ఒక్కటి అడక్కు. గత కొద్ది రోజుల నుంచి కామెడీ హీరో అల్లరి నరేష్ సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చారు. అవి ఆయనకి మంచి విజయం సాధించి పెట్టాయి కూడా. అయితే తన కెరియర్ మొదట్లో తనకు బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన కామెడీ ఫార్ములాని మరోసారి అమలు చేయడానికి ట్రై చేశాడు ఈ హీరో. రాజేంద్రప్రసాద్ తరువాత అంతటి కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నారు అల్లరి నరేష్. ఇక ఈసారి ఏకంగా రాజేంద్రప్రసాద్ సినిమా పేరునే తన సినిమాకు పెట్టుకుంటూ.. ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజేంద్రప్రసాద్ ఎన్నో సంవత్సరాల ముందు నటించిన ఈ చిత్రానికి అల్లరి నరేష్ తండ్రి.. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించడం విశేషం.
కాగా ఇప్పుడు అదే సినిమా పేరుతో.. కథ మాత్రం పూర్తి డిఫరెంట్ గా ..ఈ ‘ఆ ఒక్కటి అడక్కు’.. సినిమా ప్రేక్షకుల ముందుకి గత నెలలో వచ్చింది. అయితే ఈ సినిమా అల్లరి నరేష్ కి నిరాశ మిగిల్చింది. ప్రేక్షకులను ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమాని ఓటీటీలోకి వచ్చాక చూద్దామని చాలామంది ఫిక్స్ అయిపోయారు.
ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ స్విమ్మింగ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందని తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ చది చప్పుడు లేకుండా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేసింది ఈ సినిమా.
అసలు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. మరి థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, కల్పలత, అనీష్ కురువిల్లా, హర్ష చెముడు, అరియానా గ్లోరీ ముఖ్య పాత్రల్లో నటించారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు.
Also read: Aadhaar Card Validity: ఆధార్ కార్డుకు వ్యాలిడిటీ ఉంటుందా, ఎలా చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook