నాంది సినిమా భారీ విజయంతో మరోసారి తానేంటో నిరూపించుకున్న అల్లరి నరేష్ మరో అద్భుత కథాంశంతో ముందుకొస్తున్నాడు. విభిన్న కథాంశమే కాకుండా..ఈ సినిమా టైటిల్ కూడా భిన్నంగా ఉంది. సినిమా విడుదల తేదీతోపాటు ట్రైలర్ కూడా విడుదలై సంచలనం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామెడీనే కాదు సీరియస్ పాత్రల్ని పోషించగలనని నిరూపించుకోవడమే కాకుండా సరైన విజయాల్లేక సతమతమైన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు నాంది సినిమాతో అల్లరి నరేష్. ఈ సినిమాలో అల్లరి నరేష్ నటనకు అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా అల్లరి నరేష్‌కు 59వ సినిమా. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలై ఆసక్తి రేపుతోంది. హాస్య మూవీస్-జీ స్టూడియోస్ సంయక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు.


మారుమూల అటవీ ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ అధికారి పాత్ర అల్లరి నరేష్‌ది. ఈ ఊరిలో ఆ అధికారికి ఎదురైన కష్ట నష్టాలు, ప్రతి నాయకుడి వ్యవహారం, అల్లరి నరేష్‌పై గ్రామస్థులు దాడి చేయడం వంటి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. అడవుల మద్య బతికే ఆ ఊరిజనంతో ఓట్లేయించేందుకు అల్లరి నరేష్ చేసిన ప్రయత్నాలన్నీ సినిమాలో వివరంగా చిత్రీకరించారు. 


వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్రలు ముఖ్యమైన పాత్రల్లో కన్పించనున్నారు. అటు జాంబీ రెడ్డి సినిమాలో ఆకట్టుకున్న ఆనంది ఈ సినిమాలో నటిస్తోంది. వైవిద్యమైన కథాంశంతో రూపొందిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ట్రైలర్ అయితే ఆలోచింపజేస్తోంది. నవంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి. చేయని నేరానికి జైలు శిక్షఅనుభవిస్తూ..ఆ కేసు నుంచి అల్లరి నరేష్ ఎలా బయటపడ్డాడనేది నాందీ సినిమా కధ. ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో..ప్రతి నాయకుడి పనుల వల్ల అల్లరి నరేష్‌ను గ్రామస్థులు తప్పుగా భావించి కొట్టడం, ఆ గ్రామంలో ఎదురైన పరిస్థితులు, ఎలా పరిష్కరించాడనేది కథాంశాలుగా ఉన్నాయి.


Also read: Bigg Boss: మెట్రో రైళ్లలోనూ వెంటాడనున్న బిగ్‌బాస్ కళ్లు, తస్మాత్ జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook