Sree Vishnu Birthday Gift: మెంటల్ మదిలో.. బ్రోచేవారెవరురా.. సామజ వర గమన.. లాంటి వైవిద్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన హీరో శ్రీ విష్ణు. ఈ హీరో సినిమాలు అంటే మినిమం కంటెంట్ ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. కాగా ఈ హీరో సినిమాలలో ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేటట్టే ఈ హీరో పుట్టినరోజుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే ఈయన ఫిబ్రవరి 29న పుట్టడం. ఇందువలన శ్రీ విష్ణు బర్తడే నాలుగు సంవత్సరాలకి ఒకసారి వస్తూ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంవత్సరం లీప్ ఇయర్ కావడంతో.. ఈరోజు ఫిబ్రవరి 29న శ్రీ విష్ణు తన పుట్టిన రోజుని ఎంతో స్పెషల్ గా జరుపుకున్నారు.  ఈ నేపథ్యంలో తన రాబోయే చిత్రాల గురించి అభిమానులకు తెలియజేశారు ఈ హీరో. ఈక్రమంలోనే నిర్మాత అల్లు అరవింద్ కూడా హీరో శ్రీ విష్ణు కి ఒక సూపర్ గిఫ్ట్ ని పంపించారు. ఆ గిఫ్ట్ ఏంటో శ్రీవిష్ణు ఒక వీడియో షేర్ చేస్తూ అందరికి తెలియజేసారు.


ఈ వీడియోలో శ్రీ విష్ణుకి ఒక గిఫ్ట్ బాక్స్ రాగ ఆ బాక్స్ లో స్కై బ్లూ.. పింక్ పజిల్స్ ఉన్నాయి. ఇక అవన్నీ జత పరచగా లాస్ట్ లో గీత సమర్పణలో తాను ఒక సినిమా చేస్తున్న అర్థం వచ్చేలా పోస్టర్ రెడీ అయింది. ఇక ఈ అల్లు అరవింద్ సమర్పణలో తాను తన 18వ సినిమాని చెయ్యబోతున్నాను అంటూ ఖరారు చేశాడు ఈ హీరో. కళ్యా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న ఈ సినిమాకి కార్తీక్ రాజు డైరెక్ట్ చేయబోతున్నారు. తమిళంలో కొన్ని యాక్షన్ కామెడీ సినిమాలని డైరెక్ట్ చేశారు ఈ దర్శకుడు. ఇప్పుడు శ్రీవిష్ణుతో ఓ రొమాంటిక్ కామెడీ డ్రామా తెరకెక్కించబోతున్నారని అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే అర్ధమవుతుంది.


 



కాగా ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీవిష్ణు ‘హుషారు’ సినిమా డైరెక్టర్ హర్ష కొనుగంటి తో ‘ఓం భీమ్ బుష్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తరువాత ‘స్వాగ్’ అనే చిత్రంతో కూడా మన ముందుకి రాబోతున్నారు.


Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..


Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు


 



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter