Aha OTT: తెలుగు ఓటీటీ ప్లాట్​ ఫామ్​ ఆహా.. విస్తరణకు సిద్ధమైంది. కరోనా మొదటి దశ సంక్షోభం సమయంలో అందుబాటులోకి వచ్చిన.. 'ఆహా' జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఓటీటీ ప్లాట్​ఫామ్​లకు ధీటుగా కంటెట్ అందిస్తూ.. విజయవంతంగా ముందుకు సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాలతో పాటు.. స్పెషల్ షోలు, టాక్​ షోల వంటి వాటిని స్టీమింగ్​కు అందుబాటులో ఉంచుతోంది ఆహా ఓటీటీ. అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే వంటి షోలు 'ఆహా'ను మరింత మందికి చేరువ చేశాయనడంలో సందేహం (Aha OTT Shows) లేదు.


అయితే.. ఇప్పుడు ఇదే ఊపులో 'ఆహా తమిళ్​' ఓటీటీని ఆవిష్కరించేందుకు.. ఆహా నిర్వాహకులైన ప్రముఖ ప్రొడ్యూసర్​ అల్లు అరవింద్ (Allu Aravind on Aha OTT)​ సిద్ధమయ్యారు.


పొంగల్ 2022 సందర్భంగా 'ఆహా' తమిళ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఆహా తమిళ్​ ట్విట్టర్ హ్యాండిల్​ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా.. ఆ ట్వీట్​ను ఆహా తెలుగు ట్విట్టర్ హ్యాండిల్​లో (Aha Tamil) షేర్ చేశారు.



అయితే ఆహా తమిళ్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.


తెలుగులో అందించినట్లుగానే.. తమిళంలో కూడా సినిమాలతో పాటు.. ఒరిజినల్​, ఎక్స్​క్లూజివ్ షోలు ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.


'ఆహా' గురించి..


'ఆహా' ఓటీటిని అర్హా మీడియా అండ్ బ్రాడ్​కాస్టింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్​, (గీతా ఆర్ట్స్​ జాయింట్ వెంచర్​), మై హోం గ్రూప్​లు సంయుక్తంగా తీసుకొచ్చాయి. 2020 మార్చి 25న దీనిని ఆవిష్కరించారు. ప్రస్తుతం కేవలం తెలుగు కంటెంట్​ మాత్రమే అందుబాటులో ఉంది.


Also read: Sukumar Bollywood Offer: సుకుమార్​కు బాలీవుడ్ ఆఫర్- స్వయంగా కోరిన టాప్ హీరో!


Also read: Anasuya Sankranthi Celebrations: అనసూయ సంక్రాంతి సంబరాలు.. పార్కులో భర్తతో కలిసి.. !!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook