Allu Arjun on Raghava Lawrence తమిళ హీరోలైన విశాల్, లారెన్స్, సూర్యలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. అయితే విశాల్ తన సినిమాకు తెగే ప్రతీ టికెట్‌లో ఓ రూపాయి రైతుకు వెళ్లేలా చేస్తాడని అందరికీ విదితమే. ఇక సూర్య అయితే తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందిని చదివిస్తుంటాడు. లారెన్స్ కూడా పిల్లలను దత్తత తీసుకోవడం, అనాథాశ్రమాలు, వృద్దాశ్రమాలు నడుపుతుండటం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా మరో నూట యాభై మంది పిల్లల్ని దత్తత తీసుకోవడంపై బన్నీ స్పందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుద్రుడు సినిమాను తెలుగులోనూ లారెన్స్ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. రుద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లారెన్స్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న బంధాన్ని తలుచుకున్నాడు. ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ ఇలా అందరితో తనకున్న బంధాన్ని చెప్పుకొచ్చాడు. ఇక రామ్ చరణ్‌ చిరుత కోసం చేసిన సాంగ్ నాటి రోజుల్ని మళ్లీ అందరికీ చెప్పాడు.


 



అయితే రుద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే లారెన్స్ తన మంచితనాన్ని, సేవాగుణాన్ని ప్రదర్శించాడు. మళ్లీ కొత్తగా 150 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నట్టుగా, వారి బాగోగుల్ని, చదువు సంధ్యలు తన బాధ్యత అన్నట్టుగా అందరి ముందు చెప్పేశాడు. ఆ పిల్లలందరి లారెన్స్ ఫోటో దిగి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ ట్వీట్‌కు బన్నీ స్పందించాడు. 


Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే


మిమ్మల్ని చూస్తే గౌరవం పెరుగుతోందన్నట్టుగా బన్నీ స్పందించాడు. రెస్పెక్ట్ అని చెబుతూ హార్ట్ సింబల్‌ను షేర్ చేశాడు. ఇక బన్నీ వేసిన ట్వీట్‌కు లారెన్స్ ఫ్యాన్ తిరిగి రిప్లైలు పెడుతున్నారు. బన్నీ, లారెన్స్ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతంలో లారెన్స్ మాట్లాడిన మాటలను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. స్టైల్ పార్ట్ 2 తీస్తే అందులో బన్నీ లాంటి మంచి డ్యాన్సర్‌తో చేయాలని ఉందంటూ చెప్పిన మాటలను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.


Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook