Allu Arjun Allu Arha Cute Video  : అల్లు అర్జున్ అల్లు అర్హ ముచ్చట్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. అది పెళ్లి గురించి అయినా, దోశల స్టెప్పులు అయినా ఇలా అన్నీ నెటిజన్లు కట్టిపడేస్తుంటాయి. ఈ ఇద్దరి సంభాషణలు, ముద్దు ముద్దు ముచ్చట్లకు అందరూ ఆకర్షితులవుతారు. తాజాగా కందిరీగలు కుడుతున్నాయ్ అంటూ అల్లు అర్హ మాట్లాడిన మాటలు, బన్నీ రియాక్షన్లు అందరినీ నవ్వించేస్తున్నాయి. ఈవీడియోలో అర్హ చెప్పిన మాటలు ఎంతో క్యూట్‌గా, ముద్దుగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 



ఈ వీడియోలో తండ్రీకూతుళ్లు ఇలా మాట్లాడుకున్నారు.. 
బన్నీ : ఏమున్నాయ్ అక్కడ.. 
అర్హ : కందిరీగలు వాళ్ల జుట్లోకి వెళ్తున్నాయ్.. 
బన్నీ : ఆ పుట్ట ఎక్కడుంది.. 
అర్హ : ఎక్కడుంది కిందుంది.. పొగపెట్టి.. 
బన్నీ : పొగపెట్టి ఏం చేశారు.. 
అర్హ : తీసినారు.. 
బన్నీ : ఏం చేశారు తీసినారు.. తెలంగాణలో మాట్లాడుతున్నావ్.. 
అర్హ : అలా తీసి.. 
బన్నీ : ఎందుకు భయపడుతున్నావ్.. 
అర్హ : ఎందుకంటే అవి కుడుతున్నాయ్.. ఇన్ని ఉన్నాయ్.. చెట్టుకి కందిరీగలు.. 
బన్నీ : ఎక్కడుంది.. 
అర్హ : మన కింద ఉన్నాయ్.. ఇగో ఇక్కడే..

అంటూ ఇలా అర్హ చేసిన అల్లరి చేష్టలు, బన్నీ మాటలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. క్యూటెస్ట్ బేబీ అల్లు అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెబుతూ బన్నీ విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ కట్టిపడేస్తోంది. బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మీద ఫోకస్ పెట్టాడు. ఈ ఏడాదిలో ఎలాగైనా సెట్స్ మీదకు వెళ్లాలని భావిస్తోంది చిత్రయూనిట్. ఇక అవతార్ రిలీజ్ రోజున.. పుష్పకు సంబంధించిన చిన్న పాటి టీజర్‌ను రిలీజ్ చేసి విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ వేశాడట.


Also Read : Adah Sharma Latest Pics : విల్లులా వంగిన ఆదా శర్మ.. ఆ భంగిమలకు కళ్లు చెదిరిపోవాల్సిందే


Also Read : Jason David Frank Suicide : పవర్ రేంజర్ ఇకలేరు.. ఆత్మహత్య చేసుకున్న గ్రీన్ రేంజర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook