Jason David Suicide : పవర్ రేంజర్ సిరీస్‌కు వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అందులో గ్రీన్ రేంజర్‌గా ఎంట్రీ ఇచ్చి.. వైట్ రేంజర్‌గా మారి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న జాసన్ డేవివ్ ఫ్రాంక్ ఆత్మహత్య చేసుకున్నారు. జాసన్ సూసైడ్‌కు గల కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గ్రీన్ రేంజర్ మృతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. 90వ దశకంలోని వారికి పవర్ రేంజర్స్ ఎంత ఎంటర్టైనింగ్‌గా ఉండేవో చెబుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జాసన్ డేవిడ్ కేవలం నటుడు మాత్రమే కాదు.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, తైక్వాండో, మా తాయ్, జుడో, బ్రెజిలియన్ జియు జిత్సు వంటి వాటిల్లో నైపుణ్యం సాధించినవాడు. 2008 నుంచి 2010 వరకు వీటిల్లో అధికారికంగా శిక్షణ ఇచ్చేవాడు. ప్రస్తుతం అతను తన నలుగురు కుమారులతో ఉన్నాడు. పవర్ రేంజర్ మొదటి సీజన్లో గ్రీన్ రేంజర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత వైట్ రేంజర్‌గా మారిపోయాడు. గ్రూపుకు లీడర్ అయ్యాడు. మూడు సీజన్లు, 123 ఎపిసోడ్స్‌లో జాసన్ లీడ్‌గా నటించాడు.
వైల్డ్ ఫోర్స్, టర్బో, జియో, డినో థండర్, మెగాఫోర్స్, నింజా స్టీల్, హైపర్ ఫోర్స్ వంటి వాటిల్లోనూ జాసన్ అదరగొట్టేశాడు. రెడ్ రేంజర్, బ్లాక్ రేంజర్, గ్రీన్ రేంజర్‌గానూ మెప్పించాడు. అందుకే పవర్ రేంజర్స్‌లో జాసన్ అందరికీ ఫేవరేట్ అయ్యాడు.
జాసన్ వ్యక్తిగత మేనేజర్ జస్టిన్ మొదటగా ఈ వార్తను ప్రపంచానికి తెలియజేశారు. ఇక ఈయన ఆత్మహత్య వార్తలపై ఆయన స్పందిస్తూ.. ఓ మంచి మనిషి చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులున్నారు.. ఇలాంటి సమయంలో వారి వ్యక్తిగత ప్రైవసీని గౌరవించండి.. జాసన్ ఎప్పుడూ తన బంధుమిత్రులను, అభిమానులను ప్రేమిస్తూనే ఉండేవాడు.. నిజంగా ఇకపై అతడ్ని మిస్ అవుతాం అని చెప్పుకొచ్చాడు.
Also Read : Prasanna Kumar: మేమలా అనలేదు, వారసుడు వివాదంపై పెదవి విప్పిన ప్రసన్న కుమార్
Also Read : Jabardasth Rakesh - Sujatha : జామ తోటలో ప్రేమ పక్షులు.. జబర్దస్త్ రాకేష్, సుజాత వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook