Pushpa 2: పుష్ప2లో సమంత…మరో హీరోయిన్ వద్దంటున్న బన్నీ ఫ్యాన్స్
Pushpa 2 Item Song: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్పా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. కాగా ఈ రెండో భాగంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐటమ్ సాంగ్ గురించి కొన్ని చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి…
Samantha in Pushpa 2: దర్శకుడు సుకుమార్ ఐటెం సాంగ్స్ కి పెట్టింది పేరు. సుకుమార్ సినిమా ఫ్లాప్ అయినా సందర్భాలు ఉన్నాయేమో కానీ.. ఆయన సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ఫెయిల్ అయిన సందర్భాలు అస్సలు లేవు. ఆయన డిజాస్టర్ సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో చివరిగా రిలీజ్ అయిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా పరంగా సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు మన లెక్కల మాస్టర్.
అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. తగ్గేదేలే అంటూ పుష్ప: ది రైస్ కి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే ఫాలో అవుతూ ఈ రెండో భాగం కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని పుష్ప : ది రూల్ పైన ఫాన్స్ కి అంచనాలు విపరీతంగా ఉన్నాయి. పుష్పా సినిమా సూపర్ హిట్ కారణాలలో మ్యూజిక్ కూడా ఒకటి. పుష్ప చిత్రంలో ప్రతి పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ ‘ఉ అంటావా మామ’ ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్ లో సమంత డాన్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు పుష్పా రెండో భాగంలో ఐటమ్ సాంగ్ పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పుష్పా రెండో భాగం ఐటమ్ సాంగ్ లో సమంత కనపడనుండి అని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ తో సమంత సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఇప్పుడు రెండో పార్ట్ లో వేరే హీరోయిన్ పెడితే ఆ రేంజ్ అందుకోలేరని.. అందుకే సుకుమార్ మళ్లీ సమంతనే తీసుకుందామని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాత్రం సమంత ని ఐటమ్ సాంగ్ కోసం పుష్పా టీమ్ ఇప్పటివరకు అయితే సంప్రదించలేదని తెలుస్తోంది.
కానీ ఐటెం గర్ల్ కోసం వేట మాత్రం కొనసాగుతుందంట. కొంతమంది మాత్రం ఈ మధ్యకాలంలో ఐటెం సాంగ్స్‌కి బాగా ఫేమస్ అయిన ఊర్వశి రౌతేలాను తీసుకుంటారని అంటున్నారు. ఈ వార్త విన్న బన్నీ ఫాన్స్ అసలు ఊర్వశిని మాత్రం తీసుకోవద్దని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెడుతున్నారు. ఎందుకంటే ఊర్వశి ఐటెం సాంగ్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయిందని కనుక తనని మాత్రం తీసుకోవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇప్పటివరకూ ఊర్వసి తెలుగులో నాలుగు ఐటెం సాంగ్స్ చేసింది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కి స్టెప్పులేసింది. ఇందులో వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ అయింది. మిగతా మూడు సినిమాలు డిజాస్టర్లగా మిగిలాయి.. అందుకే సమంతని తీసుకోవడమే మంచి ఆప్షన్ అని మరొక హీరోయిన్ ఊర్వశి మాత్రం వద్దని.. రిక్వెస్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook