Desamuduru Cinema Re Release సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మీద ఎంత పాజిటివ్ ఇమేజ్ ఉంటుందో.. అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా ఉంటుంది. ఆర్మీ అంటూ తన అభిమానులను ఉద్దేశించి పదే పదే మాట్లాడే బన్నీ మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. ఇక బన్నీ పీఆర్ టీం పేరు కూడా ఎక్కువగా చర్చల్లోకి వస్తుంటాయి. అయితే బన్నీ బర్త్ డేను ఈ సారి గ్రాండ్‌గా నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. అసలే ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో బన్నీని నటించిన సినిమాను కూడా థియేటర్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే బన్నీ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన దేశముదురు సినిమాను మళ్లీ విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే దీనికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. ఈ సినిమాను 4k ఫార్మాట్‌లోకి మార్చాలంటే దాదాపు ఇరవై ఐదు లక్షలు ఖర్చవుతాయని, ఆ మొత్తాన్ని చెల్లిస్తే రిలీజ్ చేద్దామని నిర్మాత డీవీవీ దానయ్య అన్నాడట.


దీంతో ఆ సినిమాను రీ రిలీజ్ చేయాలనే ఆలోచనే మానుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇలా క్యాన్సిల్ చేయడం మీద మరో రకమైన రూమర్ కూడా వినిపిస్తోంది. బన్నీ దేశముదురు సినిమాకు ఎవ్వరూ రావడం లేదని, బజ్ లేదని, థియేటర్లు ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే రీ రిలీజ్ చేయడం లేదని ట్రోల్స్ చేస్తున్నారు.


 



మొత్తానికి ఈ రీ రిలీజ్‌ల విషయంలో మాత్రం మహేష్‌ బాబు ఫ్యాన్స్ ముందుగా సక్సెస్ అయ్యారు. పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ తొలిప్రేమ, జల్సా సినిమాలను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఖుషి, ఒక్కడు సినిమాలను కూడా రీ రిలీజ్ చేశారు. అవన్నీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ నడుస్తోంది. అయితే దేశ ముదురు సినిమాను రీ రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.


Also Read:  RC 15 Title : రామ్ చరణ్‌కి నిజంగానే 'గేమ్ చేంజర్'.. కథ ఏంటో చెప్పేసిన శంకర్


Also Read: Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook