Allu Arjun Fans in Tension : ఇండస్ట్రీ వారు సుకుమార్ ను లెక్కల మాస్టర్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టర్ గా పని చేసిన అనుభవం ఉన్న ఆయన దర్శకుడిగా మారి సక్సెస్ లు అందుకుంటూ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా నిలిచాడు. చివరిగా అల్లు అర్జున్ తో ఆయన పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేసి విజువల్ ట్రీట్ ఇవ్వకున్నా, మన మాస్ కంటెంట్ తో అన్ని ప్రాంతాల వారిని మాయ చేయవచ్చు అని నిరూపించారు. అందుకే పుష్ప సినిమా మన దగ్గర కంటే ఉత్తరాదిలో ఎక్కువ వసూలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఆ సినిమా అయిపోయింది కాబట్టి ఆయన పుష్ప సినిమా రెండో భాగం మీద దృష్టి పెడుతున్నాడు. నిజానికి పుష్ప లైన్ అనుకున్నప్పుడు ఒకే భాగంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత లెక్కలు అన్నీ తారుమారు అయ్యాయి. నిడివి అంతకంతకూ పెరుగుతూ పోవడంతో ఏమి చేయాలా అని అలోచించి రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఒక ఎర్రచందనం చెట్లు కొట్టే కూలి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నేషనల్ లెవెల్ స్మగ్లర్ లెవల్ కి ఎలా ఎదిగాడు అనేది పుష్ప ది రైజ్ పేరిట విడుదల చేశారు.
 
అలా ఎదిగిన స్మగ్లర్ తర్వాత ఏం చేశాడు?  అనే విషయాన్ని పుష్ప ది రూల్ పేరిట విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ కేజీఎఫ్ సినిమా దెబ్బకు అంతా తారుమారు అయింది. ఎందుకంటే కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన తర్వాత హిందీ బెల్ట్ లో విపరీతమైన క్రేజ్ లభించింది. ఈ క్రమంలో పుష్ప మేకర్స్ కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు. సాదాసీదాగా సినిమాను తీసి వదిలేయకుండా దాన్ని విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. 
 
అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు సుకుమార్ తీరు బన్నీ అభిమానులను టెన్షన్ పెడుతోంది. దానికి కారణం సుకుమార్ ఎక్కువగా మీడియా ముందు కనపడడమే. సుకుమార్ ఖాళీగా ఉన్నారో లేక కాదనలేక పిలిచిన అన్ని ఈవెంట్స్ కు హాజరవుతున్నారో తెలియదు కానీ ఆయన ఈ మధ్య రిలీజైన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో దర్శనం ఇచ్చారు. సర్కారు వారి పాట, శేఖర్, తాజాగా అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు ఆయన అతిధిగా హాజరయ్యారు. ఇప్పుడు ఆయన విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.  ఇలా ఆయన అన్ని ఈవెంట్స్ కు తిరగడమే బన్నీ ఫ్యాన్స్ (Allu Arjun)కు  టెన్షన్ గా మారింది. 
Also Read : సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే అమ్మాయిలు, పబ్బులు కాదు.. దూల తీరిపోద్ధిరా రేయ్!


Also Read : Sai Pallavi Kashmir Genocide: కశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యలకు తేడా ఏముంది.. సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook