కొత్త దర్శకుడికి అల్లు ఛాన్స్?
'నాపేరు సూర్య' అనే సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే..! ఈ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిలింకు డైరెక్టర్ వక్కవంతం వంశీ. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనిలో బిజీగా ఉంది. ఈ సినిమా పూర్తవగానే అల్లు అర్జున్ కొత్త సినిమా చేయనున్నారని సమాచారం.
ఇప్పటికే కొత్త సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ అయ్యింది. లింగ స్వామి, విక్రమ్ కుమార్ కథలు కూడా వినిపించారట. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఒక కొత్త డైరెక్టర్ కూడా చేరాడు. అతను చెప్పిన స్క్రిప్ట్ బన్నీకి బాగా నచ్చడంతో అతనినే సెలెక్ట్ చేయవచ్చని వినికిడి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుందని.. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!