Allu Arjun - SKN: వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, క‌మ‌ర్షిషియ‌ల్ చిత్రాలు నిర్మిస్తూ, అభిరుచి గ‌ల నిర్మాత‌గా  గుర్తింపు పొందిన నిర్మాత ఎస్‌కెఎన్‌ (SKN). ఇటీవల ఈయ‌న త‌న  తండ్రిని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఇంకా SKN మరియు అతని కుటుంబం అంతా తన తండ్రి గారి మరణంతో బాధలోనే  ఉన్నారు. కాగా ఈ మంగళవారం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్‌ కె ఎన్ నివాసానికి వెళ్లి ఆయనకు ఓదార్చారు. ఎస్‌కెఎన్ తండ్రి గారి చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు. మొద‌ట్నుంచి  అల్లు అర్జున్ యొక్క ప్రతిభ మరియు అంకితభావానికి అమితమైన ఆరాధకుడు అయిన ఎస్‌ కె ఎన్‌, ఆయన్ని చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఇపుడు బన్నీ తన ఇంటికి రావడం ఎస్‌ కె ఎన్‌ కి చాలా ఓదార్పునిచ్చింది. ఇలాంటి క‌ష్ట  సమయంలో తన ఇంటికి వచ్చినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు  నా ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారి మృతికి ఆయన వచ్చి సానుభూతి మరియు సంతాపం తెలియ చేసినందుకు ధన్యవాదాలు. 'బేబీ', 'టాక్సీవాలా' వంటి విజయవంతమైన చిత్రాలతో ఎస్‌ కె ఎన్ అంద‌రికి సుప‌రిచితుడే. త్వరలో కల్ట్ మూవీ చేస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్ విషయానికొస్తే.. పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతేకాదు ఈ మూవీకి తొలిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మ్యూజికల్‌గా మంచి సక్సెస్ అయింది. ఈ మూవీకి రెండో పార్ట్ పుష్ప 2 తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఈ యేడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ .. త్రివిక్రమ్‌తో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.


Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు


Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook