Pushpa 2: కర్ణాటకలో చుక్కెదురు.. బెనిఫిట్ షో ఆపివేత..!
Pushpa 2 benefit shows cancelled: పుష్ప సినిమా టికెట్ రేట్లు.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బెనిఫిట్ షో టికెట్లు ధర సాధారణ ప్రేక్షకునికి అందనంత ఎత్తుకి పెట్టడంపై ఎందరో మంది పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కర్ణాటకలో ఈ సినిమాకి అడ్డంకులు వచ్చి పడ్డాయి.
Pushpa 2 banned: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా బెనిఫిట్ షోలు ఆపివేయాలని పలుచోట్ల అటు ప్రేక్షకులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా బెనిఫిట్ షో ల వల్ల ఎవరికి ఉపయోగం అని, వీటివల్ల సామాన్యుడిపై భారం పెరుగుతోంది అని అందరూ కామెంట్లు చేశారు. దీనికి తోడు ఎనిమిది వందల రూపాయలు బెనిఫిట్ షో కి పెట్టాలి అంటే సామాన్యులు ఇంత ఖర్చు పెట్టి సినిమాను చూడలేకపోతున్నారు. పైగా మిడ్ నైట్ షోలు అంటే పిల్లలతో షోలకి వెళ్తే వారి ఆరోగ్యం దెబ్బతింటుందని కూడా సీనియర్ జర్నలిస్టులు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
అటు టికెట్ ధరలు కూడా పెంచడంతో సినిమాపై పూర్తి వ్యతిరేఖత నెలకొంది. ఎవరైనా సరే అభిమానులు తమ అభిమాన హీరో సినిమాను మొదటి రోజే మొదటిగా చూడాలని అనుకుంటారు. కానీ ఒకేసారి రూ.2000 నుండి రూ.5000 వరకు టికెట్ ధర పెట్టడంతో సామాన్యులు ఎలా సినిమా చూస్తారని, ఒకవేళ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లినా.. ఒక సినిమాకి పదివేల రూపాయలు ఖర్చవుతుంది అని కూడా ఇటీవల హైకోర్టు మండిపడిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా కర్ణాటకలో చుక్కెదురయ్యింది అని చెప్పాలి. కర్ణాటకలో ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ పుష్ప 2 మిడ్ నైట్ షోలను ఆపివేయాలని విన్నపం ఇవ్వగా.. ఈ మేరకు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈరోజు మిడ్ నైట్ ప్రారంభమయ్యే బెనిఫిట్ షోలను వేయకుండా నిలిపివేశారు.
ఏది ఏమైనా బెంగళూరులో ఇప్పుడు బెనిఫిట్ షోలు ఆపివేయడంతో దాదాపు చాలావరకు నష్టం వాటిల్లుతుందనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏ మేరకు నిర్మాతలు దీనిపై నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.