Allu Arjun: వాళ్లకు టార్గెట్ గా మారిన అల్లు అర్జున్.. అసలు కారణం అదేనా..!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాళ్లకు టార్గెట్ మారారా.. అప్పట్లో ఓ సినీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కు గురించి ఫ్యాన్స్ గురించి అడినపుడు చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ తో అల్లు అర్జున్ .. మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గానికి టార్గెట్ గా మారినట్టు తెలుస్తోంది.
Allu Arjun: గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గం వాళ్లకు టార్గెట్ గా మారారు. అతని సినిమా విడుదలైతే చాలు.. నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసే పనిలో పడ్డారు. తాజాగా త్వరలో విడుదల కాబోతున్న పుష్ప 2 పై అదే విధమైన టాక్ స్ప్రెడ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీకి అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది.
అయితే.. అల్లు అర్జున్ ను టార్గెట్ చేయడం వెనక మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గం వాళ్లు మాత్రం.. బన్ని బిహేవియర్ వల్ల దీనికి కారణం అని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ బేస్ వల్లే అల్లు అర్జున్ సినిమాలను ఆదరించారు ప్రేక్షకులు. కానీ అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీ నుండి వేరుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. ఇదే మెగాభిమానుల్లో కొంత మందికి అతనిపై రగిలిపోయేలా చేస్తోంది. తాజాగా అల్లు అర్జున్.. బాలయ్య.. ‘అన్ స్టాపబుల్ షో’లో చిరంజీవి తనకు హీరోగా కంటే వ్యక్తిగా ఫ్యాన్ అని చెప్పడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టైయిందని చెబుతున్నారు.
మరోవైపు బన్ని కూడా తనను తాను కూడా మెగా ఫ్యామిలీ దూరంగా తన కంటూ సొంతంగా ఓ కోటరిని ఏర్పాటు చేసుకున్నారు. పైగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓ వైపు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నట్టే చెప్పి.. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వైసీపీ నేతకు ప్రచారం చేయడం కూడా మెగాభిమానుల్లో కోపాన్ని నషాలానికి ఎక్కేలా చేసింది. అంతేకాదు అల్లు అర్జున్ .. సొంతంగా అల్లు అర్జున్.. తన అభిమానుల పేరును అల్లు అర్జున్ ఆర్మీగా పెట్టడం కూడా వివాదానికి ఆజ్యం పోసినట్టు అయింది. దీనిపై హైదరాబాద్ లో అల్లు అర్జున్‌పై గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ & వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆర్మీ అనే పదానికి అర్ధం లేకుండా చేశారని మండిపడ్డారు. దేశ నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సైదులు ను కలిసి ఫిర్యాదు చేశారు.
అల్లు అర్జున్ తన అభిమానుల పేరును అల్లు అర్జున్ ఆర్మీగా పెట్టారని, దీనిని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్మీ జాతీయ సమగ్రత, జాతీయ భద్రతను అవమానిస్తూ ఆయన విభిన్న వేదికలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఆర్మీ అనేది ఫ్యాన్స్ ఉపయోగించని ప్రతిష్టాత్మకమైన పేరు కావున అల్లు అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. మరోవైపు మెగాభిమానుల్లో ఓ వర్గం అల్లు అర్జున్ అతి మాములుగా లేదనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం పుష్ప 2పై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందాలేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.